రిజర్వాయర్లో జలాశయంలో రియల్ ఎస్టేట్ భూ అక్రమాన్ని అడ్డుకొట్టి వేయాలి.
కళ్యాణపులలోవ జలాశయంలో 2 గంటలో జల దీక్ష. ప్రదర్శన నిర్వహించడం జరిగింది.
జెడ్ జోగంపేట కొత్త పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలి.
నాన్ షెడ్యూల్ గిరిజల్ని 5వ షెడ్యూల్లో చేర్చాలి
డిమాండ్లతో జర దీక్ష నిర్వహించడం జరిగింది
జిల్లా జాయింట్ కలెక్టర్ జలాశయం అక్రమాలపై స్వయాన పరిశీలన చేసి చర్య తీసుకోవాలి.
రావికమతం (అనకాపల్లి) : అనకాపల్లి జిల్లా రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ పరిధిలో కళ్యాణ్ పులోవ రిజర్వాయర్ 1970లో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి హయాంలో నిర్మించబడిన ఈ రిజర్వాయర్ ద్వారా 14 గ్రామ పంచాయతీల పరిధిలోని సుమారు 4,484 ఎకరాల వ్యవసాయ భూమికి సాగునీరు అందుతోంది. వేలాది మంది రైతుల జీవనాధారంగా ఉన్న ఈ జలాశయం ప్రస్తుతం భూ మాఫియా అక్రమ కార్యకలాపాల వల్ల ప్రమాదంలో పడింది.
అధికారుల వివరాల ప్రకారం .... రిజర్వాయర్ FTL (Full Tank Level), జలాశయ గర్భంలో సుమారు 45 ఎకరాలకు పైగా మట్టి నింపబడినట్లు కనిపిస్తోందని, 30 అడుగుల లోతు వరకు మెరక తవ్వి తీసిన మట్టిని జలాశయంలోనే పోస్తున్నట్లు గమనించామని చెప్పారు. అంతేకాకుండా, జలాశయంలోకి నీరు చేరే సహజ ఫీడర్ కాలువలను కూడా మట్టితో మూసివేస్తున్నట్లు ఆరోపించారు. ఈ చర్యల వల్ల రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోవడంతో పాటు, రానున్న రోజుల్లో రైతులకు సాగునీటి తీవ్ర కొరత ఏర్పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
మైనింగ్ వల్ల మరో ముప్పు : కల్యాణపులోవ రిజర్వాయర్ నాలుగు కొండల మధ్య నిర్మించబడిందని, ఆ కొండల్లో గతంలో అక్రమ గ్రానైట్ మైనింగ్ జరిగిందని తెలిపారు. ప్రజల పోరాటం అనంతరం అటవీ శాఖ ఐదు లారీల గ్రానైట్ దిమ్మలు, మైనింగ్ యంత్రాలు మరియు ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసినప్పటికీ, ఇప్పటి వరకు తదుపరి చర్యలు పూర్తి కాలేదని అన్నారు. ప్రస్తుతం స్వాధీనం చేసిన లారీలు దొండపూడి చెక్‌పోస్ట్ వద్ద ఉన్నాయని, యంత్రాలు సంబంధిత క్వారీల వద్ద ఉన్నాయని, వాటిని విడుదల చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే సమాచారం స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. మళ్లీ అక్రమ మైనింగ్ ప్రారంభమైతే జలాశయ నీటి పరివాహక ప్రాంతం, అటవీ సంపద మరియు పర్యావరణానికి తీవ్ర నష్టం సంభవిస్తుందని హెచ్చరించారు.
ప్రభుత్వానికి వినతి : జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి రెవెన్యూ, ఇరిగేషన్, మైనింగ్, అటవీ, పోలీసు శాఖలతో సంయుక్త తనిఖీ నిర్వహించాలని, DGPS సర్వే ద్వారా FTL హద్దులను గుర్తించాలని, అక్రమ ఆక్రమణలను తొలగించి జలాశయాన్ని యథాస్థితికి తీసుకురావాలని, ఆక్రమణదారులు మరియు అక్రమ మైనింగ్‌కు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జలాశయాలపై జరుగుతున్న ఆక్రమణలు కేవలం ప్రభుత్వ భూముల ఆక్రమణ మాత్రమే కాదని, రైతుల జీవనాధారం, ప్రజల నీటి భద్రత, పర్యావరణ పరిరక్షణ, భావితరాల హక్కులపై జరుగుతున్న దాడి అని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ ఆక్రమిత భూములు ప్రవేట్ భూములు అయితే ప్రజా ప్రయోజనాలు, రైతులకు నీటి నిలువ సామర్థ్యం పెంచేందుకు ప్రభుత్వం ఎక్విజేషన్ చేసి FTL పరిధిలో ఉంచాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ అంశంపై . తక్షణ చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్యబద్ధమైన, చట్టబద్ధమైన ఉద్యమాన్ని మరింత విస్తృతం చేస్తామని హెచ్చరించారు. జెడ్ జోగంపేట కేంద్రంగా పోలింగ్ బూతు చేయాలని, 11 గిరిజన గ్రామాలకి ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే గోవిందరావు గదబరి రాజు. గమ్మిల వాసు. వంతల చిరంజీవి. పాంగి రమేషు తదితరులు పాల్గొన్నారు








కామెంట్‌లు (0)