ప్రజాశక్తి - అనకాపల్లి: జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఇండియన్ సొసైటీ ఫర్ కల్చరల్ కోఆపరేషన్ అండ్ ఫ్రెండ్ షిప్ (ఇస్కఫ్) ఆధ్వర్యంలో శనివారం అనకాపల్లిలోని శ్రామిక స్థానంలో "నెహ్రూ ఆర్థిక విధానాలు దేశాభివృద్ధికి ఎలా దోహదం చేశాయి - ప్రస్తుతం దేశంలో అనుసరిస్తున్న విధానాలు ఎలా ఉన్నాయి" అనే అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం నిర్వహించారు. దీనికి అధ్యక్షత వహించిన ఇస్కఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఎం మాధవరావు మాట్లాడుతూ నెహ్రూ పంచ వర్ష ప్రణాళికల ద్వారా బహుళార్థ సాధక ప్రాజెక్టులను నిర్మించి, భారీ పరిశ్రమలను స్థాపించి దేశాన్ని వ్యవసాయం, పారిశ్రామిక పరంగా అభివృద్ధి చేశారని తెలిపారు. నెహ్రూ ప్రవేశపెట్టిన ప్రణాళికాబద్ధ అభివృద్ధి, ప్రభుత్వ రంగ సంస్థలు, భారీ పరిశ్రమలు, డ్యాంలు, వ్యవసాయం, విద్య, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో తీసుకున్న నిర్ణయాలు దేశ పురోగతికి పునాదులు వేశాయని పేర్కొన్నారు. ప్రస్తుత మోడీ అవలంబిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలు ధరల పెరుగుదలకు దారి తీస్తూ సామాన్యుడిపై భారాలను మోపుతోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు విల్లూరి పైడారావు, పిల్లా హర శ్రీనివాసరావు, బొట్టా చిన్ని యాదవ్, ప్రకాష్, బొడ్డేడ అప్పారావు, మొల్లి రమణ బాబు, వై ఎన్ భద్రం, వెంకటేశ్వర రావు, వీరాచారి, కోన లక్ష్మణ, దాడి శివరాం, సత్యనారాయణ, కె. హరనాధ్, సూదికొండ మాణిక్యం, సూరిశెట్టి రామచంద్రరావు, కె.సత్యనారాయణ, సూరిబాబు పాల్గొన్నారు.
‘నెహ్రూ ఆర్థిక విధానాలు-దేశాభివృద్ధికి దోహదం’పై చర్చ
14 నవంబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 14, 2026, 06:16 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)