ప్రజాశక్తి-రావికమతం: ప్రజా సమస్యలపై సమరశీల పోరాటాలు సాగించడమే సీతారాం ఏచూరికి మనం అందించే ఘన నివాళి అని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కే. గోవిందరావు అన్నారు. రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ పరిధిలోని కళ్యాణపులోవ గ్రామంలో సీపీఎం ఆధ్వర్యంలో శనివారం సీతారాం ఏచూరి సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. సీతారాం ఏచూరి తన జీవితాన్ని ప్రజా సమస్యల పరిష్కారం కోసం అంకితం చేసిన గొప్ప యోధుడని కొనియాడారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయల రాయితీలు ఇస్తూ, సామాన్య ప్రజానీకంపై విపరీతమైన భారాలు మోపుతున్నాయని విమర్శించారు. ప్రజల ఆస్తులను, ప్రకృతి సంపదను కార్పొరేట్లకు అప్పగించి వారి సంపదగా మార్చేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి నిరంతరం పోరాటాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు గమ్మిల ప్రసాద్, గమ్మిల వాసు, సేదరి కామేష్ తదితరులు పాల్గొన్నారు.
ఏచూరికి ఘన నివాళి ప్రజా పోరాటాలే
12 సెప్టెంబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 12, 2026, 01:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)