ప్రజాశక్తి-దేవరాపల్లి : మండలంలోని ముషిడిపల్లి వద్ద ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. దేవరాపల్లి నుంచి విశాఖపట్నం వెళ్తున్న 12డి ఆర్టీసీ బస్సు ఎదురుగా వచ్చిన బైక్‌ను తప్పించే క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం అదుపు తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 32 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే డ్రైవర్ చాకచక్యంతో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పి ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ద్విచక్ర వాహనం నడుపుతున్న యువకుడికి కాలు విరిగి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని మెరుగైన వైద్యం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. దేవరాపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు
13 నవంబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 13, 2026, 08:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)