ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రైవాడ జలాశయానికి సందర్శకుల తాకిడి

13 నవంబర్, 2026

రైవాడ జలాశయానికి సందర్శకుల తాకిడి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026, 08:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-దేవరాపల్లి : నాగులచవితి పర్వదినాన్ని పురస్కరించుకొని మండలంలోని రైవాడ జలాశయం సందర్శకులతో సందడిగా మారింది. శుక్రవారం సాయంత్రం జలాశయం అందాలను తిలకించేందుకు పరిసర ప్రాంత గ్రామాల ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. వివిధ ప్రాంతాలకు ఉపాధి నిమిత్తం వలస వెళ్లిన వారంతా పండుగకు స్వగ్రామాలకు చేరుకోవడంతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి రైవాడ జలాశయం సందర్శనకు వెళ్లారు. చుట్టూ పచ్చని కొండలు.. వాటి మధ్య నిండుకుండలా దర్శనమిస్తున్న జలాశయం.. ఆహ్లాదకరమైన ప్రకృతి వాతావరణం సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. జలాశయం అందాలను వీక్షిస్తూ పలువురు ఆనందంగా గడిపారు. ఎరకాలమ్మ తల్లి గుడి పరిసరాల నుంచి జలాశయం గేట్ల వరకు సందర్శకుల రాకపోకలతో సందడి నెలకొంది. పండుగ సెలవు రోజును ప్రకృతి ఒడిలో కుటుంబ సభ్యులతో గడిపేందుకు ప్రజలు ఆసక్తి చూపడంతో రైవాడ పరిసరాలు జనసందోహంగా మారాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్