గురువారం, 29 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తుఫాను వల్ల నష్టపోయాం.. ఆదుకోండి : గిరిజన జీడి రైతుల ఆందోళన

1 గంట క్రితం

We have suffered losses due to the cyclone please help us Tribal cashew farmers plea
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 29, 2026, 02:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • అర్నబ్ తుఫాన్ వల్ల నష్టపోయిన గిరిజన జీడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి


రావికమతం (అనకాపల్లి) : అనకాపల్లి జిల్లా రావికమతం మండలం టి అజ్జాపురం పంచాయతీ కొట్నాబెల్లి రెవెన్యూ పరిధిలో కోట్నిబెల్లి గ్రామ గిరిజన జీడి రైతులు గురువారం జీడి తోటలో నిరసన ఆందోళన చేపట్టారు. తుఫాను కారణంగా భారీ గాలులు వీయడంతో, జీడి మామిడి తోటలు నేలకు ఒరిగాయి. 52 కుటుంబాలవారు జీవనం సాగిస్తున్నారు. ఈ జీడి తోటల పై ఆధారపడి జీవిస్తున్నామని గిరిజనులు తెలిపారు. ఈ జీడి తోటల మీద ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల నుండి అధిక వడ్డీ డబ్బులు తీసుకొని పిల్లలకు జ్వరం వచ్చినా, స్కూల్ ఫీజులు కట్టడానికైనా ప్రధానంగా ఈ డబ్బులు మీదే బతుకుతున్నామన్నారు. నేడు ఈ తుఫాను తమ గిరిజన బతుకులను ఛిద్రం చేసిందన్నారు. జిల్లా ఆర్టికల్స్ ఆఫీసర్, రెవిన్యూ అధికారులు తమ భూములను సందర్శించి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నామన్నారు. దీనితోపాటు జెడ్ బెన్నవరం. డో లవానిపాలెం. గదభపాలెం. రామన్న దొరపాలెం గ్రామాల్లో జీడి తోటలు నేలకు ఒరిగాయి. ప్రతి కుటుంబానికి 50 కేజీలు బియ్యం ఇవ్వాలని, నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50,000 ఇవ్వాలని, ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాగలిగిన భూములకు 50 తో పాటు 125 రోజులు 175 రోజులు ఉపాధి హామీ పథకం రాంజీ పథకంలో పని కల్పించాలని గిరిజనులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే గోవిందరావు, గిరిజన సంఘం నాయకులు తూబే బెన్నయ్య, రాజులమ్మ, దేవుడమ్మ, తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్