మంగళవారం, 29 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎఎంఆర్ అక్రమ చెక్ పోస్టులను తొలగించాలి : సిపిఎం

11 గంటల క్రితం

ఎఎంఆర్ అక్రమ చెక్ పోస్టులను తొలగించాలి : సిపిఎం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 29, 2026, 05:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అనకాపల్లి :

ఎఎంఆర్ అక్రమ చెక్‌ ‌పోస్టులను తొలగించాలని, ఆ సంస్థ చేస్తున్న అక్రమ వసూళ్లను అరికట్టాలని సిపిఎం అనకాపల్లి మండల కన్వీనర్ గంటా శ్రీరామ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనకాపల్లి సిపిఎం కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఏఎంఆర్ అక్రమ్ మైనింగ్ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి కోట్లాది ప్రభుత్వ ధనాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఈ రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం

మైనింగ్ మాఫియా ద్వారా దోచుకుంటుందని, ఇటువంటి అనైతిక చర్యలకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. సీఎం రమేష్ అనకాపల్లి ఎంపీ అయిన తర్వాత స్థానిక నాయకులతో కుమ్మక్కై జిల్లాలో ఉండే మైనింగ్ మొత్తాన్ని దోచుకుతింటున్నారని తీవ్రంగా మండిపడ్డారు. అధికారులు స్పందించి ఈ ఆక్రమ మైనింగ్‌ని ఆపాలని, లేదంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వివి.శ్రీనివాసరావు మాట్లాడుతూ రోజువారి కూలిపనులు చేసుకొని జీవనోపాధి పొందుతున్న ట్రాక్టర్ ఓనర్లు, డైవర్లపై ఏఎంఆర్ సిబ్బంది దౌర్జన్యం చేస్తున్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం పెద్దలు సహకారంతోనే ఆక్రమ మైనింగ్ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు కాళ్ళ తేలయ్యబాబు, బుగిడి నూక అప్పారావు, కె.ఈశ్వరరావు, ఉరిగిటి శివ సూర్య నారాయణ తదితరులు పాల్గొన్నారు.

​

​

​

​

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్