ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గాంధీజీ ఆశయాలు స్ఫూర్తిదాయకం : హోంమంత్రి వంగలపూడి అనిత

02 అక్టోబర్, 2026

గాంధీజీ ఆశయాలు  స్ఫూర్తిదాయకం
 హోంమంత్రి వంగలపూడి అనిత image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 02, 2026, 05:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలు తరతరాలకు స్ఫూర్తిదాయకమని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. నక్కపల్లి లో ఆమె నివాసం వద్ద శుక్రవారం గాంధీ జయంతి సందర్భంగా మహాత్ముని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ సత్యం, అహింస, శాంతి మార్గాల్లో మహాత్మా గాంధీ చూపిన బాట ప్రతి ఒక్కరికీ ఆదర్శమని అన్నారు. త్యాగం, సేవ, నైతిక విలువలకు ప్రతీకగా నిలిచిన గాంధీజీ జీవితం తరతరాలకు స్ఫూర్తిదాయకమని, భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మా గాంధీ పోషించిన పాత్ర చిరస్మరణీయమని మంత్రి అనిత కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

మండలంలో పలు గ్రామాల్లో నాయకులు గాంధీజీ జయంతి వేడుకలు నిర్వహించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్