ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు సిపిఎం చేయూత

11 నవంబర్, 2026

అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు సిపిఎం చేయూత image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 11, 2026, 07:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

​అనకాపల్లి మండలం కొండకొప్పాక ఎస్సీ కాలనీలో మంగళవారం జరిగిన అగ్నిప్రమాదంలో మామిడి నరసమ్మ, కొలుసు అప్పారావు కుటుంబాలకు చెందిన రెండు తాటాకుల ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో రెండు కుటుంబాలు సర్వస్వం కోల్పోయి నిరాశ్రయులయ్యాయి. విషయం తెలుసుకున్న సిపిఎం నాయకులు బుధవారం బాధిత కుటుంబాలను పరామర్శించి, వారికి అండగా నిలిచింది. బాధితులకు బియ్యం, నిత్యావసర సరుకులు, స్టీల్ వంట పాత్రలు, దుప్పట్లు, తువ్వాళ్లు, దుస్తులు అందజేసి తక్షణ సహాయం చేసింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ శంకర్రావు మాట్లాడుతూ రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబాలు అగ్నిప్రమాదంతో కట్టుబట్టలతో మిగిలిపోవడం తీవ్ర ఆవేదన కలిగిస్తోందన్నారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి బాధిత కుటుంబాలకు తగిన ఆర్థిక సహాయం అందించాలని, నష్టాన్ని పూర్తిస్థాయిలో అంచనా వేసి తక్షణ ఉపశమన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సర్వం కోల్పోయిన ఈ రెండు నిరుపేద కుటుంబాలకు పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వివి.శ్రీనివాసరావు, బొప్పే ఉమామహేశ్వరరావు, సిపిఎం సీనియర్ నాయకులు నాగిరెడ్డి సత్యనారాయణ, కె.ఈశ్వరరావు, స్థానికులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్