ప్రజాశక్తి-అచ్యుతాపురం
జడ్పిటిసి ఎన్నికలలో తాను ఓటమి చెందిన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తానని అచ్యుతాపురం జడ్పిటిసి వైసిపి అభ్యర్థి సుహాసిని నర్మల కుమార్ చెప్పారు. సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలు తమ దృష్టికి తీసుకువస్తే గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులు దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి పనిచేస్తామని చెప్పారు. వైసిపిలో సంస్థాగతమైన సంస్కరణలు తీసుకురావలసి ఉందని, పార్టీ వ్యవహార శైలి లోపా భూయిష్టంగా ఉందని తెలిపారు. తనను ఎవరూ పలకరించడానికి రావద్దని తానే గ్రామాలకు వచ్చి కలుస్తానని చెప్పారు. పూడిమడకలో ఎంపీటీసీ స్థానానికి పోటీ చేసి ఓటమి చెందిన చోడిపల్లి అప్పారావు మాట్లాడుతూ తన ఓటమికి వైఎస్ఆర్ పార్టీయే నాయకులే కారణమని ఆరోపిస్తున్నారు. ప్రజలు తనకు సహకరిస్తే నాయకులు వ్యతిరేకంగా పనిచేశారన్నారు.







కామెంట్లు (0)