శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పోక్సో చట్టం అవగాహనా సదస్సు....

17 నవంబర్, 2026

పోక్సో చట్టం అవగాహనా సదస్సు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026, 07:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

యలమంచిలి జిల్లా పరిషత్తు బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం పోక్సో చట్టంపై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. జూనియర్ సివిల్ జడ్జి జి స్పందన ముఖ్యఅతిథిగా పాల్గొని పోక్సో చట్టం గురించి వివరించారు. ఎంత ఉన్నత పదవుల్లో ఉన్నప్పటికీ ఈ చట్టం కింద పట్టుబడిన వారు తీవ్ర శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రిన్సిపల్ సుశీల మాట్లాడుతూ చట్టం అవగాహన పెంపొందించుకొని అందుకు తగని విధంగా ప్రవర్తించాలని సూచించారు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పివి రమణ , వైస్ ప్రెసిడెంట్ ఎల్బి రామకృష్ణారావు, సెక్రెటరీ ఎం శ్రీనివాసరావు, ప్యానెల్ లాయర్ బి హరి శంకర్ రావు, తదితరులు పోక్సో చట్టంలో ముఖ్యాంశాలు వివరించారు. సదస్సులో కోర్టు సిబ్బంది, స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్