మంగళవారం, 17 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అక్వాన్ తుపాన్‌పై అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్‌

21 నిమిషాల క్రితం

అక్వాన్ తుపాన్‌పై అప్రమత్తంగా ఉండాలి
జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్‌ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026, 08:01 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

​జిల్లాలో సంభవించబోతున్న అక్వాన్ తుఫాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు వివిధ శాఖల అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, క్షేత్రస్థాయిలో పూర్తి సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్‌ ఆదేశించారు. ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్‌‌తో కలిసి కలెక్టర్‌ వివిధ శాఖ అధికారులతో మాట్లాడారు. ​రెవెన్యూ, వ్యవసాయం, ఉద్యానవనం, మత్స్య/అక్వాకల్చర్, పంచాయతీ రాజ్, ఇంజనీరింగ్, పోలీసు, రోడ్లు భవనాలు, అగ్నిమాపక, వైద్య, ఆరోగ్య శాఖలు పరస్పరం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కేవలం వాట్సాప్ సందేశాలపై ఆధారపడకుండా, మండల స్థాయి అధికారులు వ్యక్తిగతంగా ఫోన్ ద్వారా మాట్లాడుకుని ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంచుకోవాలని ఆదేశించారు. ​తుఫానుకు ముందు, ఆ తర్వాత గర్భిణీ స్త్రీలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ​రాత్రి సమయాల్లో ఇళ్లలోకి నీరు రాకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకోవాలని, పంపులు, జనరేటర్లు, జేసీబీలను కనీసం ఐదు రోజుల పాటు సిద్ధంగా ఉంచాలని. తాగునీరు, విద్యుత్ సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ​​మండలలో ప్రత్యేక అధికారులు వర్షపాతాన్ని నిరంతరం మానిటర్ చేయాలన్నారు. ​ప్రజలు నుంచి వచ్చే ఫిర్యాదులపై అధికారులు ప్రొయాక్టివ్‌గా స్పందించి తక్షణ సహాయం అందించాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ అత్యవసర సేవలు, కంట్రోల్ రూమ్ సమన్వయంతో ​104, 109, 102 వైద్య సేవలు పశుసంవర్ధక శాఖ అంబులెన్స్ సర్వీసులు నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలని చెప్పారు. ఏదేని ప్రాణనష్టం లేదా మరణం సంభవిస్తే, ఆ సమాచారాన్ని వెంటనే డి.ఆర్.ఓ ఆధ్వర్యంలో పనిచేసే కలెక్టరేట్ కంట్రోల్ రూమ్‌కు తెలియజేయాలన్నారు. ​కంట్రోల్ రూమ్, సమాచార వ్యవస్థ ​అన్ని శాఖల కార్యాలయాల్లో ఏర్పాటు చేసుకోవాలన్నారు. ​కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు, బాధ్యత వహించే అధికారుల పేర్లు, వివరాలను కలెక్టరేట్ కంట్రోల్ రూమ్‌కు తప్పనిసరిగా సమర్పించాలన్నారు. ​ గతంలో నీటిపారుదల శాఖ, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా రాత్రి వేళల్లో ఇబ్బందులు తలెత్తాయని, ఈసారి అలాంటి పొరపాట్లు జరగకూడదని స్పష్టం చేశారు. ఈసారి మత్స్యశాఖ మరింత అప్రమత్తంగా ఉండాలని, ​సముద్రంలోకి వెళ్లినవారంతా సురక్షితంగా వెనక్కి వచ్చేలా చూడాలని, బోట్లను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ​మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, తహశీల్దార్లు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ వై సత్యనారాయణ రావు వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.

​

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్