ధర్మవరం టౌన్ : కార్మికుల హక్కుల సాధన కోసం డిసెంబర్ 1 నుంచి మూడో తేదీ వరకు ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించే మహా ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అయూబ్ ఖాన్ పిలుపునిచ్చారు. కార్యక్రమానికి సంబంధించి పోస్టర్లను మంగళవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కో కన్వీనర్ ఎస్ రఫీ, అంగన్వాడి జిల్లా నాయకులు సరస్వతి, చంద్రకళ, మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు మేకల బాబు, నాగరాజు, నాగభూషణ, పెద్దక్క, ఓబులేసు, ముత్యాలప్ప, హరి, మారుతి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఢిల్లీ ముట్టడి కార్యక్రమం తో కార్మికుల సమస్యల పరిష్కారం
22 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 17, 2026, 08:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)