మంగళవారం, 17 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కార్మికుల శ్రమతో సంపద.. సంపన్నులకు ప్రభుత్వాల రాయితీలు: సిఐటియు జిల్లా అధ్యక్షులు జడ్పీ శ్రీనివాసులు

18 నిమిషాల క్రితం

కార్మికుల శ్రమతో సంపద.. సంపన్నులకు ప్రభుత్వాల రాయితీలు
సిఐటియు జిల్లా అధ్యక్షులు జడ్పీ శ్రీనివాసులు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026, 08:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

కార్మికులు తమ శ్రమతో దేశ సంపదను సృష్టిస్తుంటే, ఆ సంపదను కొద్దిమంది సంపన్నులు పోగేసుకుంటూ కుబేరులుగా మారుతున్నారని, మరోవైపు కార్మికులు కనీస వేతనాలు, పెన్షన్లు, సామాజిక భద్రతకు నోచుకోకుండా ఇబ్బందులు పడుతున్నారని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు జడ్పీ శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు ఢిల్లీలో నిర్వహించనున్న మహా ప్రదర్శన, నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.


మంగళవారం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో సీఐటీయూ నాయకులు, కార్మికులతో కలిసి గోడపత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా జడ్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ కార్మికుల శ్రమతో సృష్టించిన సంపద కొద్దిమంది చేతుల్లోకి వెళ్తోందని, ప్రభుత్వాలు సైతం సంపన్నులకు పన్ను రాయితీలు, ఇతర ప్రయోజనాలు కల్పిస్తూ వారికి మరింత అండగా నిలుస్తున్నాయని విమర్శించారు.


జిల్లా ఉపాధ్యక్షులు వీఆర్ రాము మాట్లాడుతూ శ్రీ సత్యసాయి జిల్లాలోని ఐదు మండలాల పరిధిలో గార్మెంట్స్ పరిశ్రమల్లో సుమారు 25 వేల మంది మహిళా కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. వీరిలో అనేకమంది 15 ఏళ్లుగా పరిశ్రమల్లో పనిచేస్తున్నప్పటికీ కనీస వేతనాలు, డీఏ, ఇంక్రిమెంట్లు అందడం లేదని విమర్శించారు. మహిళా కార్మికులకు కనీస సామాజిక భద్రత కూడా లేకపోవడం దారుణమన్నారు. . మహిళా కార్మికుల సమస్యలను ప్రభుత్వం, సంబంధిత కార్మిక శాఖ అధికారులు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు, వ్యవసాయ మార్కెట్ హమాలీ కార్మికులు అస్లాం, భక్తర్, మస్తాన్, అతావుల్లా, రఫిక్, బాబా, మెహర్, శివకుమార్, వెంకటేష్, నాగమ్మ, వరలక్ష్మి, నాగలక్ష్మి, వసంత తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్