మంగళవారం, 17 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వచ్చేనెల ఒకటి నుండి జరిగే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి... సిఐటియు

17 నిమిషాల క్రితం

వచ్చేనెల ఒకటి నుండి జరిగే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి... సిఐటియు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026, 08:05 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

​

వచ్చేనెల చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

పోస్టర్ ఆవిష్కరణలో సిఐటియు రాష్ట్ర నాయకులు ధోనిపూడి కాశీనాథ్ పిలుపు


ప్రజాశక్తి -విజయవాడ

విజయవాడ, గవర్నర్ పేట శ్రీశ్రీ భవన్లో వచ్చేనెల 1 నుంచి జరగనున్న ఢిల్లీ ముట్టడి కార్యక్రమం జయప్రదంకై గోడపత్రిక (పోస్టర్) ఆవిష్కరణ కార్యక్రమం విజయవాడ ఆకర్షణ తోపుడు బండ్లు యూనియన్ (సిఐటియు )ఆధ్వర్యంలో మంగళవారం జరిగింది. ఈ సందర్బంగా సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం పనిచేస్తున్న కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక పాలనను ప్రశ్నిస్తూ, కార్మికులకు నష్టదాయకంగా తెచ్చిన నాలుగు లేబర్‌కోడ్‌లను రద్దు చేసిందిని స్కీం వర్కర్లు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులకు పర్మినెంట్, కనీస వేతనం రూ.42 వేలు, పెన్షన్ రూ. 21 వేలుగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. అసంఘటిత రంగ కార్మికులకు సమగ్రచట్టం, సామాజిక భద్రత, ఖాళీల భర్తీ, సర్ రద్దు, జల్-జమీన్-జంగిల్‌పై ప్రజల హక్కులు కాపాడాలని లక్షలాది మంది కార్మికులతో డిసెంబర్ 1 నుంచి 3 వరకు ఢిల్లీ ముట్టడి కార్యక్రమంలో వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు..కంపెనీలు కొత్తగా తీసుకునే ఉద్యోగుల వేతనాల్లో కొంత భాగం, యజమాని కట్టాల్సిన పీఎఫ్ వాటాను కూడా కేంద్ర ప్రభుత్వమే కట్టడానికి కేటాయింపులు చేసింది. వారికి లక్షలాది కోట్ల పన్నులు రాయితీలిస్తున్నది. రుణ మాఫీలు చేస్తున్నారు. మరో ప్రక్క వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలు (స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించి వారికి కనీస వేతనాలు ఇవ్వడానికి, సామాజిక భద్రత కల్పించడానికి డబ్బులు లేవంటున్నారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, స్కీమ్ ఉద్యోగులకు పర్మినెంట్ చేయటానికి బడ్జెట్ లేదంటోందిని అన్నారు.*మోడీ ప్రభుత్వం 4 లేబర్‌కోడ్లను అమల్లోకి తెచ్చి కనీస వేతనాన్ని మరింతగా దిగజార్చింది. జాతీయ కనీస వేతనం పేరుతో రోజుకు రూ. 178 వేతనంగా నిర్ణయించింది. 8 గంటల పని విధానానికి తూట్లు పొడిచిందని,. ఉద్యోగ భద్రతను కాలరాసిందని అన్నారు. సమ్మె చేయకుండా ఆటంకాలు విధించింది. కోట్లాది మంది కార్మికుల కార్మిక చట్టాలు అమలు కాకుండా చేసింది. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మోడీ ప్రభుత్వానికి తోకగా మారింది. పై డిమాండ్ల సాధనకై డిసెంబర్ 1 నుండి 3 వరకు ఆక్యూపై ఢిల్లీలో సిఐటియు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో కార్మికులు పెద్ద ఎత్తున జయప్రదం చేయమని సిఐటియు పిలుపునిస్తోందని పేర్కొన్నారు..రాష్ట్రంలో 4 లక్షల మంది అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్నభోజనం, వీఓఏ, ఆర్పీ సమగ్రశిక్ష, నేషనల్ హెల్త్ మిషన్, ఉపాధిహామీ, 108, 104, తల్లీ, బిడ్డ, అర్బన్ హెల్త్, ఆయుష్, ఎన్టీఆర్ వైద్యసేవ తదితర ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్నారు. వీరే కాక 3 లక్షల మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, టైమెస్కేల్, కంటింజెంట్, డైలీవేజ్, పార్టెమ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. నిత్యవసర సరుకుల ధరలు, పెరిగిన ఇంటి అద్దెలు, గ్యాసు, విద్యుత్ చార్జీల నేపథ్యంలో అందరికీ కనీస వేతనం రూ.42 వేలుగా నిర్ణయించి అమలు చేయాలని సిఐటియు డిమాండ్ చేస్తోందిని అన్నారు.అందుకై డిసెంబర్ 1 ఢిల్లీ అక్రమణ కార్యక్రమంలో పాల్గొనమని సిఐటియు పిలుపునిస్తోంది. ఇదే స్థాయిలో హమాలీ, ఆటో, బిల్డింగ్, గిగ్, స్వయం ఉపాధి, వలస కార్మికులకు కూడా నెల ఆదాయం రూ.42 వేలు గ్యారంటీ చేయాలి. సగం పెన్షన్ రూపంలో, ఈపీఎస్, సీపీఎస్, ఎన్పీఎస్ మరియు సామాజిక పెన్షనర్లకు ఇవ్వాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో ఖాళీలన్నింటిని భర్తీ చేయాలి.ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సిఐటియు సెంట్రల్ సిటీ నగర ప్రధాన కార్యదర్శి కే. దుర్గారావు, నగర కార్యదర్శి ఎం. సోమేశ్వరావు, హాకర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సి. హెచ్. మురళి, ఆర్గనైజింగ్ కార్యదర్శి బి లక్ష్మణ్, నాయకులు ఉదయ్ కుమార్, వస్తాను, లక్ష్మి, సూరమ్మ, శీను, పిడుగు శ్రీను, అబ్దుల్లా, పెద్ద బాజీ, పద్మ, హేమంత్, ఆల్తాఫ్, పోస్టర్ లను ఆవిష్కరించారు. వార్త ఎడిటింగ్‌

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్