శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చోడవరం పంచాయతీ టిడిపి సర్పంచ్‌ అభ్యర్థిగా పెదబాబు

18 నవంబర్, 2026

చోడవరం పంచాయతీ టిడిపి సర్పంచ్‌ అభ్యర్థిగా పెదబాబు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 18, 2026, 07:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

చోడవరం మేజర్ పంచాయతీ టిడిపి సర్పంచ్ అభ్యర్థిగా గూనురు వెంకట సత్యనారాయణ (పెదబాబు)ను ఆ పార్టీ ప్రకటించింది. బుధవారం చోడవరం సీతారామ కళ్యాణ మండపంలో 20 వార్డులకు సంబంధించిన టిడిపి క్యాడర్‌తో అభిప్రాయ సేకరణ జరిపారు. పార్టీ పరిశీలకురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి, స్థానిక ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు కేడర్‌‌ నుండి అభిప్రాయాలను తీసుకున్నారు. మెజార్టీ పార్టీ కార్యకర్తలు పెదబాబు పేరును సూచించినట్లు జిల్లా టిడిపి ఎన్నికల పరిశీలకులు కొండపల్లి అప్పలనాయుడు తెలిపారు. అభిప్రాయ సేకరణకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. సర్పంచ్ అభ్యర్థిగా తమను ప్రకటించాలని టిడిపి నాయకులు సకురు కోటేశ్వరరావు, నౌవుడు సుధాకర్ పరిశీలకులను కోరారు.

​

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్