ప్రజాశక్తి-అచ్యుతాపురం
మండలంలోని హరిపాలెం పంచాయతీలో వార్డు మెంబర్లుగా సిపిఎం బలబర్చిన అభ్యర్థులు శుక్రవారం నామినేషన్లు వేశారు. మూడో వార్డు మెంబర్‌గా కాండ్రేగుల బాబురావు, నాలుగో వార్డు మెంబర్‌గా శరగడం మంగ, 5వ వార్డు మెంబర్‌గా బొడ్డేడ రామ్ కుమార్ నామినేషన్లు ఎన్నికల నిర్వహణ అధికారికి అందజేశారు. గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాండ్రేగుల రామ సదాశివరావు నామినేషన్ వేసిన సంగతి తెలిసినదే. ఇప్పటికే ఆయన ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం. ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కర్రి అప్పారావు, సిపిఎం అచ్యుతాపురం మండల కన్వీనర్ ఆర్.రాము, సిఐటియు మండల కార్యదర్శి కె.సోమ నాయుడు, బుద్ధ రంగారావు, జడ్పిటిసి స్థానానికి పోటీ చేసిన గంగిరెడ్డి నారాయణమ్మ తదితరులు రామసదాశివరావుకు ఓట్లు వేసి గెలిపించాలని ప్రచారం చేశారు.







కామెంట్‌లు (0)