చైన్ స్నాచింగ్ వంటి నేరాలకు పాల్పడే వ్యక్తులు తప్పుడు నెంబర్ ప్లేట్లతో తిరగడం, వాహనాల గుర్తింపునకు ఆటంకం కలిగించేలా నెంబర్ ప్లేట్లు ఏర్పాటు చేయడాన్ని అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. డీఎస్పీ ఆదేశాల మేరకు అనకాపల్లి టౌన్ లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా ఈ తనిఖీలు నిర్వహించారు. విరిగిపోయిన, స్పష్టంగా కనిపించని, నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన నంబర్ ప్లేట్లున్న వాహనాలను తనిఖీ చేశారు. హిట్ అండ్ రన్ ప్రమాదాల సమయంలో వాహనాలను గుర్తించేందుకు వీలుగా నెంబర్ ప్లేట్లు స్పష్టంగా కనిపించేలా నిబంధనల ప్రకారం ఏర్పాటు చేసుకోవాలని వాహనదారులకు సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా నెంబర్ ప్లేట్లు ఉన్న వాహనదారులకు జరిమానాలు విధించి, సరైన నెంబర్ ప్లేట్లను ఏర్పాటు చేయించారు. ఈ కార్యక్రమంలో టౌన్ సీఐ జి. ప్రేమ్ కుమార్, ట్రాఫిక్ సీఐ నాగేశ్వరరావు, టౌన్ ఎస్ఐ షేక్ జిలాని, ట్రాఫిక్ ఎస్ఐ అర్జున్, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
తప్పుడు నెంబర్ ప్లేట్లపై పోలీసుల ప్రత్యేక తనిఖీలు
6 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 21, 2026, 07:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)