శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్...

6 రోజుల క్రితం

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026, 07:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అనకాపల్లి మండలంలోని తుమ్మపాల, కొత్తూరు పరిధిలోని పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల ఏర్పాట్లపై శనివారం కలెక్టర్ విజయ కృష్ణన్ క్షేత్రస్థాయి పరిశీలించారు. ఓటర్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని మౌలిక సదుపాయాలను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో తాగునీరు, విద్యుత్ సరఫరా, ఫ్యాన్లు/లైట్లు, మరుగుదొడ్లు, దివ్యాంగ ఓటర్ల కోసం ర్యాంప్‌ల ఏర్పాటును తనిఖీ చేశారు. ​ పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు, క్యూ లైన్ల నిర్వహణ, పోలింగ్ సిబ్బందికి అవసరమైన వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. ఎన్నికల కోడ్, ఎన్నికల సంఘం నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని, ఏవైనా లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌తో పాటు ఆర్డీవో శ్రీనివాసరావు, డిపిఓ కిరణ్ కుమార్ ఎంపీడీవో ఆశాజ్యోతి, తహసీల్దార్ ఆనందరావు పాల్గొన్నారు.

​

​

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్