మడికి గ్రామ పార్టీ అధ్యక్షుడు, సీనియర్ నేతగా చేసిన సేవలకు అవకాశం
ఎమ్మెల్యే బండారుకు వీర విధేయుడిగా, పిలిస్తే పలికే నేతగాను గుర్తింపు
ప్రజాశక్తి - ఆలమూరు : ఆలమూరు మండల తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థిగా మడికి గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు, పార్టీ గ్రామ అధ్యక్షుడు దొండపాటి సుబ్బరాజును మంగళవారం పార్టీ శ్రేణులతో కలిసి వాడపాలెం పార్టీ ఆఫీసులో ఎంఎల్ఏ బండారు సత్యానందరావు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తున్న వారిలో మంచి పేరున్న నాయకుడిగా, పిలిస్తే పలికే నేతగాను, వివాద రహితుడుగా, సౌమ్యుడిగా ఆయనకు గుర్తింపు ఉందన్నారు. అలాగే పలువురు పార్టీ నేతలు మాట్లాడుతూ ఎమ్మెల్యే బండారు సత్యానందరావుకు వీర విధేయుడిగా ఉంటూ పార్టీ పట్ల తన నిబద్ధతను చాటుకున్నందుకు సముచిత స్థానం దక్కిందన్నారు. తాజాగా టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా ఆయన పేరు మంగళవారం ఎమ్మెల్యే బండారు ప్రకటించడంతో ఎవరనే ఉత్కంఠకు ముగింపు పలికినట్లయింది. దీంతో ఆలమూరు మండల రాజకీయాల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు ఆసక్తిగా ఓటర్ల వద్దకు పరుగులు పెడుతున్నారు.








కామెంట్‌లు (0)