ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్ : నూతనంగా ఎన్నికైన అనంతపురం నగరపాలక సంస్థ మేయర్ రమేష్ గౌడ్ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.రాంభూపాల్‌ను శుక్రవారం కలిశారు. అనంతపురం గణేనాయక్ భవన్‌లో వారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాభినందనలు తెలిపారు. మేయర్ గెలుపులో తనకు సహకరించినందుకు సిపిఎం జిల్లా నాయకత్వానికి అభినందనలు తెలిపారు. అనంతరం ఎన్నికల్లో చోటు చేసుకున్న సంఘటనలు, సరళిపై చర్చించారు. ఈ సందర్భంగా నూతన మేయర్ రమేష్ గౌడ్‌కు సిపిఎం రాష్ట్ర, జిల్లా నాయకత్వం అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఓ.నల్లప్ప, కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్.నాగేంద్ర కుమార్, ఎం.బాల రంగయ్య, నగర కార్యదర్శి వి.రామిరెడ్డి పాల్గొన్నారు.










కామెంట్‌లు (0)