మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బత్తలపల్లిలో 50 శాతం రాయితీపై పశుదాణా పంపిణీ

6 రోజుల క్రితం

atp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 18, 2026, 01:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- మొదటి విడతలో రెండు పంచాయతీలకు 13 మెట్రిక్ టన్నుల కేటాయింపు

ప్రజాశక్తి-బత్తలపల్లి: మండల కేంద్రమైన బత్తలపల్లిలో పశుపోషకులను ప్రోత్సహించడంతోపాటు పశువులకు పోషకాహారం అందించాలనే ఉద్దేశంతో బత్తలపల్లి పశువైద్యశాలలో 50 శాతం రాయితీపై పశుదాణా పంపిణీ చేస్తున్నట్లు ఏడీ డాక్టర్ శ్రీనివాసులు తెలిపారు. మొదటి విడతలో మండలంలోని రెండు గ్రామ పంచాయతీలకు మొత్తం 13 మెట్రిక్ టన్నుల పశుదాణా కేటాయించినట్లు వెల్లడించారు. ఇందులో బత్తలపల్లి పంచాయతీకి 6 మెట్రిక్ టన్నులు, సంజీవపురం పంచాయతీకి 7 మెట్రిక్ టన్నుల పశుదాణా సరఫరా చేసినట్లు పేర్కొన్నారు. ఒక యూనిట్ పశుదాణా పూర్తి ధర రూ.1,110 కాగా, ప్రభుత్వం 50 శాతం రాయితీ కల్పించడంతో పశుపోషకులకు రూ.555కే అందిస్తున్నట్లు తెలిపారు. మిగిలిన గ్రామ పంచాయతీలకు కూడా విడతలవారీగా పశుదాణా పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని ఆయా గ్రామ పంచాయతీల పరిధిలోని పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ శ్రీనివాసులు సూచించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్