ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్లు బుధవారం నుండి ప్రారంభమయ్యాయి. ఎంపీటీసీ, జడ్పిటిసి స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ల ఫారాలను నింపడానికి లాయర్లు ఉపాధ్యాయులు తదితరుల చుట్టూ తిరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ముఖ్యంగా పోటీ చేసే అభ్యర్థుల్లో నామినేషన్ ఫారం నింపడంలో ఏ చిన్న పొరపాటు జరిగినా నామినేషన్లను ఎక్కడ అధికారులు తిరస్కరిస్తారోనన్న ఆందోళన మొదలైంది. పోటీ చేసే అన్ని పార్టీల రాజకీయ నాయకులతో స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో స్థానిక ఎన్నికలు నామినేషన్లు తదితర విధి విధానాలపై ఆర్ఓ భారతి ఏ ఆర్ ఓ మమతాదేవి ఆధ్వర్యంలో అవగాహన కూడా కల్పించడం జరిగిందని, నామినేషన్ వేసే వారికి ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవడానికి ఎంపీడీవో కార్యాలయంలో ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అని, అనవసరంగా ఏ ఒక్కరి నామినేషన్ కూడా అధికారులు తిరస్కరించరని.. తిరస్కరణ కారణముంటేనే తిరస్కరిస్తారని అనవసరంగా నామినేషన్ తిరస్కరిస్తే సంబంధిత బాధితులు ఆర్డీవో కోర్టుకు వెళ్ళవచ్చునని అధికారులు తెలిపారు. అనవసర ఊహాగానాలు విని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు.
ఎంపీడీవో కార్యాలయం చుట్టూ పటిష్టమైన బందోబస్తు - ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల రెండో రోజైన గురువారం సిఐ రాగిరీ రామయ్య ఎస్సై సాగర్ ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం చుట్టూ ప్రతిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. గూగుడు రోడ్డు లో స్థానిక శ్రీనివాస థియేటర్ దగ్గర నుంచి 4 వ సచివాలయం వరకు రోడ్డు బ్లాక్ చేయడం గూగూడు వైపు పలు పల్లెలకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిబంధనలను ఎవరు అతిక్రమించిన కఠిన చర్యలు తప్పవని సిఐ రామయ్య ఎస్ఐ సాగర్ తెలిపారు.








కామెంట్లు (0)