సోమవారం, 27 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

నీట్ పేపర్ లీక్ వల్ల అమరులయిన అమాయక విద్యార్థులకు సిపిఐ మౌనం

1 గంట క్రితం

CPI remains silent on the innocent students who lost their lives due to the NEET paper leak.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 27, 2026, 04:35 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : మండల కేంద్రంలోని స్థానిక పంచాయతీ కార్యాలయంలోని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ నాయకుల ఆధ్వర్యంలో నీట్ పేపర్ లీక్ వల్ల అమరులయిన అమాయక విద్యార్థుల ఆత్మకు శాంతి చేకూరాలని అంబేద్కర్ విగ్రహం వద్ద సోమవారం సిపిఐ నాయకులు మౌనం పాటించి నివాళులర్పించారు ఈ సందర్భంగా సిపిఐ నాయకులు జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నప్ప యాదవ్ మాట్లాడుతూ .... బిజెపి మతతత్వ పార్టీ అన్ని రంగాల్లో విఫలమైంది అమాయక విద్యార్థులు బలిగొన్న ఎన్ డి ఏ ప్రభుత్వం వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది అందుకోసం వారి కుటుంబంలో ఒక్కొక్కరికి ఒక ప్రభుత్వ ఉద్యోగం, కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా 5 ఎకరాల ప్రభుత్వ భూమి, ఒక ఇల్లు తక్షణమే అందించాలి అప్పుడేైనా వారి కుటుంబాలు ఆత్మస్థైర్యం కలగడానికి అవకాశం ఉంది ఈ ఉద్యమంలో కేంద్రబలగాలతో విద్యార్థులపై కర్కషకదాడిని తీవ్రంగా ఖండించారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యద దర్శులు చాపల రామంజి, లలితమ్మ ,సుధాకర్, పెద్ద పెద్దయ్య, నారాయణప్ప, శివమ్మ, పెద్దక్క, సంజీవ రాయుడు, తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్