మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మధుమేహ బాధితులు కంటి పరీక్షలను నిర్లక్ష్యం చేయొద్దు

12 నవంబర్, 2026

manipal
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 12, 2026, 10:19 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- మధుమేహ బాధితులకు శాన్విక చెస్ట్ అండ్ ఐ హాస్పిటల్ ప్రత్యేక వైద్య ప్యాకేజీ

- రూ.499కే డయాబెటిక్ కంటి పరీక్షలు – నవంబర్ 1 నుంచి 30 వరకు ప్రత్యేక రాయితీలు

- డయాబెటిక్ రెటినోపతితో చూపు కోల్పోయే ప్రమాదం – డాక్టర్ మన్నెం జ్యోతి

ప్రజాశక్తి - అనంతపురం : మధుమేహంతో బాధపడుతున్నవారు కంటి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలని శాన్విక చెస్ట్ అండ్ ఐ హాస్పిటల్ కన్సల్టెంట్ ఆప్తాల్మాలజిస్ట్, ఫాకో సర్జన్, మెడికల్ రెటీనా నిపుణులు డాక్టర్ మన్నెం జ్యోతి సూచించారు. మధుమేహం కారణంగా డయాబెటిక్ రెటినోపతి, గ్లకోమా, క్యాటరాక్ట్ వంటి కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రారంభ దశలో ఈ సమస్యలకు సంబంధించిన లక్షణాలు స్పష్టంగా కనిపించకపోవచ్చని, నిర్లక్ష్యం చేస్తే క్రమంగా చూపు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నవంబర్ నెలను డయాబెటిక్ కంటి వ్యాధుల అవగాహన మాసంగా నిర్వహిస్తున్న సందర్భంగా అనంతపురంలోని శాన్విక చెస్ట్ అండ్ ఐ హాస్పిటల్‌లో నవంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు ప్రత్యేక వైద్య పరీక్షల ప్యాకేజీని అందిస్తున్నట్లు తెలిపారు. కేవలం రూ.499కే కంటి వైద్యుల సంప్రదింపు, అధునాతన ఫండస్ కెమెరా ద్వారా కంటి నాడీ పరీక్ష, గ్లకోమా పరీక్ష, స్లిట్ ల్యాంప్ పరీక్ష, ఆటో రిఫ్రాక్టోమీటర్ ద్వారా కళ్లద్దాల పవర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

అంతేకాకుండా కంటి వైద్యులు సూచించిన ఇతర పరీక్షలపై 20 శాతం, లేజర్ ఇన్వెస్టిగేషన్లపై 20 శాతం, కంటి అద్దాలపై 40 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

మధుమేహం ఉన్న ప్రతి ఒక్కరూ కనీసం క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా వ్యాధులను ముందుగానే గుర్తించి తగిన చికిత్స పొందవచ్చని డాక్టర్ మన్నెం జ్యోతి సూచించారు. చూపు కోల్పోయే పరిస్థితి రాకముందే అప్రమత్తం కావాలని కోరారు. అనంతపురం సాయినగర్‌లోని 7వ క్రాస్‌లో ఉన్న శాన్విక చెస్ట్ అండ్ ఐ హాస్పిటల్‌లో ఈ ప్రత్యేక ప్యాకేజీ అందుబాటులో ఉంటుందని తెలిపారు. అపాయింట్‌మెంట్ కోసం 9346247154, 08554-351589 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్