ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : మండల కేంద్రంలోని స్థానిక వెలుగు కార్యాలయంలో నార్పల మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికల స్క్రూటిని శనివారం జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ సుయష్ కుమార్ ఆర్వో చిన్న వీర స్వామి, ఎంపీడీవో మమతా దేవి, డిప్యూటీ శ్యామల తో కలిసి పరిశీలించారు అనంతరం స్క్రూటిని జరుగుతున్న విధానాన్ని స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రశాంత వాతావరణం లో ఎన్నికలు జరగడానికి పోటీ చేసే అభ్యర్థులందరూ సహకరించాలని స్క్రూటిని కోసం వచ్చిన అభ్యర్థులను కోరారు. అనంతరం స్థానిక ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించి ఎంపీడీవో మమతా దేవి తో ఎంపీడీవో కార్యాలయ ఉద్యోగుల క్రమానుగత శ్రేణి కార్యాలయంలో ఎవరి విధులు ఏమిటి తదితర విషయాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శేషారెడ్డి సీనియర్ అసిస్టెంట్ సుభహాన్ జూనియర్ అసిస్టెంట్ బబ్లు నారాయణ సురేష్, విష్ణు, జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.
నార్పల లో స్క్రూటిని ని పర్యవేక్షించిన జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ సుయష్ కుమార్
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 21, 2026, 04:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)