జిల్లా వ్యవసాయ కార్యాలయంలోనే ప్రచార బుక్ లెట్లు : రూ.లక్షలు నిధులు వృథా
ప్రజాశక్తి - అనంతపురం : రాష్ట్ర ప్రభుత్వం ఎల్ నినో పరిస్థితులు రైతులకు ఒక సవాలుగా మారే అవకాశం ఉందని రైతులు, ఉద్యాన రైతులు, పశు పోషకులు మత్సకారులు నష్టపోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ శాఖలను అప్రమత్తం చేస్తూ సమర్థవంతంగా ఎదుర్కొందాం అనే ప్రచార బుక్ లెట్ ను లక్షల నిధులు ఖర్చు చేసి మల్టీకలర్లో బుక్లెట్ విడుదల చేసింది. ఇవి వ్యవసాయ అనుబంధ రంగాల వారీగా వారి డివిజన్ల కు అనుగుణంగా జిల్లాకు అన్నిటిని తెప్పించి ఆయా శాఖలకు పంపిణీ చేశారు. అయితే వ్యవసాయ శాఖ సంబంధించిన ఎల్ నినో ను సమర్థవంతంగా ఎదుర్కొందాం ప్రచార బుక్లెట్లు మాత్రం వ్యవసాయ జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయం గడప దాటడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా వ్యవసాయ అధికారి చాంబర్ పక్కనే ఇవి గుట్టలుగా దర్శనమిస్తున్నాయి. వచ్చిన బుక్ లెట్లు ను అనంతపురం వ్యవసాయ శాఖ పరిధిలోని ఆరు డివిజన్లకు కేటాయింపులు జెడి ఏ చేశారు. ఇందులో అనంతపురం వ్యవసాయ డివిజన్ 165, తాడిపత్రి వ్యవసాయ డివిజన్ కు 140, ఉరవకొండ వ్యవసాయ డివిజన్ కు 140 గుత్తి వ్యవసాయ డివిజన్ కు 140, కళ్యాణ్ దుర్గం వ్యవసాయ డివిజన్ 170, రాయదుర్గం వ్యవసాయ డివిజన్కు 145 చొప్పున బుక్లెట్లు రాష్ట్ర ప్రభుత్వం లక్షలు వెచ్చించి ఈ బుక్లెట్లను ప్రింట్ చేసి కార్యాలయానికి పంపింది అయితే వీటిని మండల స్థాయిలోకి, గ్రామస్థాయిలోకి తీసుకెళ్లి రైతులకు అవగాహన కల్పించడంలో జిల్లా వ్యవసాయ శాఖ యంత్రాంగం నిద్రపోతున్నట్లు కనిపిస్తుంది. రాబోయే జూలై, ఆగస్టు మాసాలు మొత్తం వర్షభావ పరిస్థితులు నెలకొన్నాయని పంటలు సాగు చేసి నష్ట పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న అవగాహన లేక రైతులు పంటలు సాగుచేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో 15 వేల ఎకరాల్లో ఖరీఫ్ పంటల సాగు జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి వేసిన పంటలు ఎలా సంరక్షించుకోవాలని అవగాహన పెంచే కార్యక్రమాలు మాత్రం వ్యవసాయ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించి రాష్ట్ర ప్రభుత్వం మంచి ఆలోచనలను రైతుల్లోకి తీసుకెళ్లే విధంగా విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉంది.









కామెంట్‌లు (0)