ప్రజాశక్తి-పుట్లూరు (అనంతపురం) : తీవ్ర విద్యుత్ కోతలు, అసలే వర్షాభావ పరిస్థితులతో అరకొర నీటితో పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. బోర్లు, డ్రిప్ ద్వారా పంటలకు నీరు అందించుకునే రైతులకు కరెంటు కోతలు శాపంగా మారుతున్న వైనం. దీంతో మండల పరిధిలోని మడ్డిపల్లె సబ్ స్టేషన్ వద్ద గురువారం అర్థరాత్రి మడ్డిపల్లి, చెర్లోపల్లి తదితర గ్రామాల రైతులు ధర్నా నిర్వహించారు. అనంతరం రైతులు మాట్లాడుతూ .... రోజుకు కనీసం నాలుగు నుంచి ఐదు గంటల పాటు కూడా వ్యవసాయానికి విద్యుత్ అందడం లేదని రైతుల ప్రజల ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9, 10 గంటల వరకు గృహ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుంది. విద్యుత్ కోతలతో గ్రామీణ ప్రాంత ప్రజలు చీకట్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఇంత దారుణమైన విద్యుత్ కోతలను గతంలో ఎన్నడూ చూడలేదంటూ ప్రజలు, రైతుల ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆర్తనాదాలు అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినిపించడం లేదా ? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజల బాధలు, రైతుల కష్టాలు అధికారులకు కనిపించడం లేదా అంటూ స్థానికులు నిలదీస్తున్నారు. వెంటనే విద్యుత్ కోతలను తగ్గించి వ్యవసాయానికి, గృహ అవసరాలకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ కోతల నుంచి రైతులు, ప్రజలను విముక్తి చేయాలని ట్రాన్స్కో అధికారులు ప్రభుత్వాన్ని రైతులు స్థానికులు కోరుకుంటున్నారు.
విద్యుత్ కోతలతో అర్ధరాత్రి రైతుల ధర్నా
11 సెప్టెంబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 11, 2026, 11:56 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)