మంగళవారం, 10 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బుకర్‌ ప్రైజ్‌ 2026 విజేతగా బ్రిటన్‌ రచయిత జాన్‌ హారిసన్‌

54 నిమిషాల క్రితం

John Harrison
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 10, 2026, 12:20 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

లండన్‌ : బ్రిటన్‌కు చెందిన ప్రముఖ సైన్స్‌ ఫిక్షన్‌ రచయిత ఎం. జాన్‌ హారిసన్‌ (81) రచించిన ‘ది ఎండ్‌ ఆఫ్‌ ఎవ్రీథింగ్‌’ నవల ప్రతిష్ఠాత్మక బుకర్‌ ప్రైజ్‌ 2026కు ఎంపికైంది. ఈ అవార్డును అందుకున్న అత్యంత పెద్ద వయస్కుడైన రచయితగా హారిసన్‌ రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా ఆయనకు సుమారు 67 వేల డాలర్లు (50 వేల పౌండ్ల ) నగదు బహుమతి లభించనుంది. అవార్డుతో పాటు పుస్తకాల అమ్మకాలు, రచయితకు గుర్తింపు కూడా పెరిగే అవకాశం ఉంది. 1945లో ఇంగ్లాండ్‌లోని రగ్బీలో జన్మించిన మిస్టర్ హారిసన్, సైన్స్ ఫిక్షన్ రంగంలో ప్రధాన రచనలుగా ప్రసిద్ధి చెందిన విరికోనియం సాగా (1971-1984), "ది కెఫాహుచి ట్రాక్ట్" అనే త్రయంలోని మొదటి సంపుటి అయిన "లైట్" (2002)తో సహా అనేక సైన్స్ ఫిక్షన్ పుస్తకాలను రచించారు.

ప్రళయం తర్వాత బ్రిటన్‌ నేపథ్యంలో సాగిన ఈ నవలలో కృత్రిమ మేధ (ఏఐ)పై సమాజంలో నెలకొన్న ఆందోళనలను వ్యంగ్యాత్మకంగా చిత్రించారు. 1980ల నాటి కింగ్‌స్టన్‌లో సాగే క్వీర్ ఇతిహాసం నుండి ఆధునిక లండన్ నేపథ్యంలో సాగే క్యాంపస్ వ్యంగ్యం వరకు వివిధ రచనలు సమర్పించిన షార్ట్‌లిస్ట్ రచయితలు మార్లన్ జేమ్స్, డగ్లస్ స్టువర్ట్, ఎలిజబెత్ స్ట్రౌట్, ల్యూక్ కెన్నార్డ్, రెబెక్కా పెర్రీలను ఆయన ఓడించారు. ఆయన 13వ నవల అయిన ‘ది ఎండ్‌ ఆఫ్‌ ఎవ్రీథింగ్‌’ సమీప భవిష్యత్తులో ఇంగ్లండ్‌ తీర ప్రాంతంలో జరిగే పరిణామాల చుట్టూ సాగుతుంది. బీచ్‌కాంబర్‌ ఫిలిప్‌ టెన్నెంట్‌, మతిమరుపుతో బాధపడుతున్న అతని స్వేచ్ఛాయుత భావాలు కలిగిన అత్త మార్నీ ఈ కథలో ప్రధాన పాత్రలు. ఓ గుర్తుతెలియని విపత్తు తర్వాత యూరప్‌ ఖండం అదృశ్యమైనట్లు కనిపించడం, మనుషులను అనుకరించగల ఐఘెట్టి అనే రహస్య వస్తువుల ఆవిర్భావం కథలో కీలక పరిణామాలు. వీటి ద్వారా మానవ జీవితంలో ఏఐ పాత్ర, దాని ప్రభావంపై రచయిత ప్రశ్నలు లేవనెత్తారు. 198 పేజీల ఈ నవలలో బ్రెగ్జిట్‌, కోవిడ్‌ మహమ్మారి, రోజువారీ జీవితంపై సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న ప్రభావం వంటి సమకాలీన అంశాలను పరోక్షంగా ప్రస్తావించారు. కథాంశం కంటే వాతావరణం, పాత్రల అనుభవాలు, కవితాత్మకమైన రచనా శైలికి రచయిత ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ప్రస్తుత ప్రపంచంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను భవిష్యత్తు నేపథ్యంలో చూపిస్తూ, నిరంతర సంక్షోభాల మధ్య మనుషులు ఎలా జీవించాల్సి వస్తుందన్న ప్రశ్నను ఈ నవల ముందుకు తెస్తుంది. గతేడాది బ్రిటిష్-హంగేరియన్ రచయిత డేవిడ్ స్జాలీ రచన "ఫ్లెష్"బుకర్ బహుమతిని గెలుచుకున్న సంగతి తెలిసిందే.


"ది ఎండ్ ఆఫ్ ఎవ్రీథింగ్" తన అసాధారణమైన, నిపుణులైన రచనా నైపుణ్యం పరంగానే కాకుండా, గొప్ప ఆశయం పరంగా కూడా ముందు నిలిచిందని న్యాయనిర్ణేత మేరీ బీర్డ్ తెలిపారు. ఈ పుస్తకంలో కృత్రిమ మేధకు సంబంధించిన ఆందోళనలు చాలా ఎక్కువగా ఉన్నాయని అన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్