ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈ నెల 13, 14 తేదీల్లో విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా భారత ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ పర్యటనలో భాగంగా నిర్వహించే కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. నవంబర్ 13న మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ విశాఖలోని ఐఎన్‌ఎస్ డే గా విమానాశ్రయానికి చేరుకుంటారు. 3.15 గంటలకు భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్‌కు స్వాగతం పలుకుతారు. అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చేరుకుని సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు నిర్వహించే 30వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ ముగింపు కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమం ముగిసిన అనంతరం సాయంత్రం 5.35 గంటలకు ఐఎన్‌ఎస్ డేగా విమానాశ్రయంలో ఉపరాష్ట్రపతికి వీడ్కోలు పలుకుతారు. అనంతరం నోవోటెల్ వరుణ్ బీచ్‌కు చేరుకుని బస చేస్తారు. నవంబర్ 14న ఉదయం 5.25 గంటలకు హోటల్ నుంచి బయలుదేరి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు.
13, 14 తేదీలలో విశాఖలో గవర్నర్ పర్యటన
52 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 10, 2026, 12:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)