ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పుట్లూరు చెరువు కు చేరని హెచ్ఎల్సీ నీరు ..

1 రోజు క్రితం

HLC water fails to reach Putluru tank
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026, 04:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

పుట్లూరు త్రాగునీటి సమస్య తీరేనా ?

ప్రజాశక్తి పుట్లూరు (అనంతపురం) : ఎల్లోని ప్రభావం వల్ల మండలంలో వర్షాలు పడకపోవడంతో భూగర్భ జలాల అడుగింటి పండ్ల తోటలన్నీ ఎండిపోతున్నాయి. కానీ త్రాగునీటి కోసం మండలంలోని చెరువులను నింపుతామని హెచ్.ఎల్.సి అధికారులు చెప్పారు కానీ ఈనెల 21వ తేదీన మండలంలోని సుబ్బరాయ సాగర్ నుండి పుట్లూరు చెరువుకు హెచ్ ఎల్ సి నీటిని విడుదల చేయడం జరిగింది. కానీ ఇంతవరకు పుట్లూరు చెరువుకు చేరకపోవడంతో రైతులతో పాటు గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. త్రాగునీటి కోసమని వదిలిన హెచ్ ఎల్ సి నీటిని తాడపత్రి మండలానికి చెందిన రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు హెచ్ ఎల్ సి నీటిని పొలాలకు వాడుకుంటున్నారు. దీంతో పుట్లూరు చెరువుకు నీరు చేరలేదు . పై అధికారులు మాత్రం త్రాగునీటి కోసం మండలంలోని పుట్లూరు, కోమటికుంట్ల, గరుగు చింతలపల్లి చెరువులను నింపుతామని చెప్పారు కానీ ఒక చుక్క కూడా పుట్లూరు చెరువు కు చేరిక దాఖలాలు కనిపించలేదు ఇప్పటికైనా హెచ్ ఎల్ సి అధికారులు స్పందించి మండలంలోని పుట్లూరు కోమటికుంట్ల, గరుచింతలపల్లి చెరువుల నింపి మండలంలో త్రాగునీటి సమస్య లేకుండా చూడాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్