ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : మండల కేంద్రమైన స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం సీపీఐ నార్పల మండల సమితి అద్వర్యములో సర్వే నంబర్ 94 లో ఇంటిపట్టాలు రద్దు కెసి అర్హులకు న్యాయం చేయాలని సిపిఐ మండల కార్యదర్శి సాకే గంగాధర అద్యక్షతన తాసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేప ట్టారు ఈ సంధర్బంగా సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యులు చిన్నప్పయాదవ్ మాట్లాడుతూ మండల వ్యాప్తంగా అర్హులైన నిరుపేదలు చాలామంది ఇంటి పట్టాల కోసం తాసిల్దార్ కార్యాలయంలో దరఖాస్తులు ఇచ్చి సంవత్సరం గడుస్తున్న ఇంతవరకు పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వడంలో అధికారులు వైఫల్యం చెందారు అని ముఖ్యంగా 94 సర్వే నెంబర్లు ఇచ్చిన పట్టా లబ్ధిదారులకు చాలామంది వికలాంగులు కాలనీలో వారికి ఇవ్వడం జరిగింది అందుకోసం రెండు పట్టాలు ఉండడం వల్ల ఏదో ఒక పట్టా రద్దు చేయాలని అనారులకు ఇచ్చిన పట్టాలను రద్దు చేయాల నిఅనేక సందర్భాల్లో సీపీఐ తరుపున అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది కానీ 94, సర్వే నెంబర్లలో పట్టాలు రద్దుచేసి అర్వులకు అందరికి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి సంవత్సరం గడుస్తున్న ఇంతవరకు లబ్ధిదారులకి నోటీసులు కూడా పంపించడంలో అధికారులు విఫలమయ్యారు ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు అనర్హుల పట్టాలు రద్దుచేసి అర్హులందరికీ ఇంటి పట్టాలు మంజూరు చేయాలని లేకుంటే సిపిఐ ఆధ్వర్యంలో కొట్టాలు వేసుకుంటామని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ద్వారా డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తున్నాం అన్నారు అనంతరం తాసిల్దార్ అరుణకుమారికి వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో ,సిపిఐ మండల సహాయ కార్యదర్శి,సుధాకర్, రైతు సంఘం మండల కార్యదర్శి,లలితమ్మ, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి, పెద్దయ్య ,నారాయణప్ప ,పెద్దక్క ,శివమ్మ ,సంజీవ రాయుడు తదితరులు పాల్గొన్నారు.
అర్హులందరికి తిరిగి ఇంటి పట్టాలు ఇవ్వాలి : చిన్నప్ప యాదవ్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 27, 2026, 04:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)