జిల్లా వ్యవసాయ అధికారి శ్రీ ఎన్. సాలు రెడ్డి
ప్రజాశక్తి -అనంతపురం : సమాచార హక్కు చట్టం–2005 కింద దరఖాస్తుదారులు కోరిన సమాచారాన్ని నిర్ణీత గడువులోగా అందించాలని జిల్లా వ్యవసాయ అధికారి ఎన్. సాలు రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం అనంతపురంలోని జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో సమాచార హక్కు చట్టం (ఆర్ టి ఐ ) వారోత్సవాల్లో భాగంగా జిల్లాలోని డీడీఓలకు సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమాన్నినిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ . సాలురెడ్డి మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టం అమలుపై అధికారులు, సిబ్బంది పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రతి కార్యాలయంలో ప్రజా సమాచార అధికారులు (పి ఐ ఓ లు), సహాయ ప్రజా సమాచార అధికారులు (ఏపీఐ ఓ ) వివరాలను తెలిపే నోటీసు బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా, సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 4(1)(బి) ప్రకారం వెల్లడించాల్సిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు నవీకరించి, ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచించారు. చట్ట నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ, పారదర్శకమైన పరిపాలనకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం జిల్లా సమన్వయ కమిటీ సభ్యులు బి. లాల్యా నాయక్, సమాచార హక్కు పరిరక్షణ సంఘం అనంతపురం అధ్యక్షులు శ్రీ హాన్నూరప్ప, ఆర్ టి ఐ యాక్ట్ ఫైట్ ఫర్ రైట్ వ్యవస్థాపకులు శ్రీ కె.పి. రాజు, సమాచార హక్కు చట్టం పరిరక్షణ సంఘం జనరల్ సెక్రటరీ శ్రీమతి మీనా బాల, సమాచార హక్కు చైతన్య వేదిక అనంతపురం అధ్యక్షులు శ్రీ రాయల కొండయ్య పాల్గొన్నారు. అలాగే, శ్రీమతి రోజా పుష్పలత, భూసారా పరీక్ష కేంద్రం సహాయ వ్యవసాయ సంచాలకులు (ఎస్ టి ఎల్ ),అనంతపురం, శ్రీమతి హేమావతి, సహాయ వ్యవసాయ సంచాలకులు (ఎఫ్ సి ఓ ల్యాబ్ ) అనంతపురం, శ్రీమతి అర్చన, సహాయ వ్యవసాయ సంచాలకులు( భూ సంరక్షణ,) అనంతపురం శ్రీ ఆర్.రాకేష్ నాయక్, వ్యవసాయ అధికారి, శ్రీమతి సునీత, వ్యవసాయ అధికారి, శ్రీమతి అర్చన, భూసంరక్షణ విభాగం సహాయ వ్యవసాయ సంచాలకులు, జిల్లా వ్యవసాయ కార్యాలయ పరిపాలన అధికారి శ్రీ ఎస్. బాలాజీ నాయక్, జే డి ఏ కార్యాలయo పర్యవేక్షకులు శ్రీమతి రాజ్యలక్ష్మి, జిల్లా అధికారులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)