ప్రజాశక్తి-నార్పల: మండల కేంద్రంలోని స్థానిక బాలికల పాఠశాలను జిల్లా విద్యాధికారి అయూబ్ హుస్సేన్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా ఉదయం ప్రార్థన సమయానికి చేరుకున్న డిఇఒ ప్రధానోపాధ్యాయులు నాగేష్తో కలిసి విద్యార్థుల హాజరు శాతంతోపాటు పలు రిజిస్టర్లను పరిశీలించారు. గత 10వ తరగతిలో మంచి ఫలితాలు వచ్చాయని.. అదేవిధంగా ఈఏడాది కూడా మంచి ఫలితాలు వచ్చేందుకు కృషి చేయాలని సూచించారు. అనంతరం పాఠశాల పరిసరాలను పరిశీలించారు. మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండటంతో అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలవురు విద్యార్థులు మరుగుదొడ్డికి వెళ్లే దారిలో బండలు ఏర్పాటు చేయాలని కోరారు. తర్వాత మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులతో మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు మెనూ ప్రకారం అన్ని అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యాధికారులు కృష్ణయ్య, నారపరెడ్డి, ఎస్ఎంసి ఛైర్మన్ ప్రకాష్, ఎస్ఎంసి సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయలు, ఉపాధ్యాయులు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
నార్పల బాలికల పాఠశాల తనిఖీ
16 నవంబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 16, 2026, 05:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)