మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కార్మిక హక్కుల సాధన కోసం డిసెంబర్‌ 1, 2, 3 తేదీల్లో ఢిల్లీని ముట్టడిద్దాం

16 నవంబర్, 2026

citu.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026, 12:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • లేబర్‌ కోడ్స్‌ రద్దు చేయాలి.. కనీస వేతనం రూ.42 వేలు చెల్లించాలి

ప్రజాశక్తి - అనంతపురం కార్పొరేషన్‌: డిసెంబర్‌ 1, 2, 3 తేదీల్లో ఢిల్లీని ముట్టడించి కార్మిక హక్కులను సాధించుకుందామని సీఐటీయూ నగర కార్యదర్శి మూర్తుజ పిలుపునిచ్చారు. సీఐటీయూ అఖిల భారత కమిటీ పిలుపులో భాగంగా నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికలను సోమవారం స్థానిక మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయ ఆవరణలో సీఐటీయూ నాయకులు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మూర్తుజ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూ, నాలుగు లేబర్‌ కోడ్లను తీసుకొచ్చి పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. వెంటనే నాలుగు లేబర్‌ కోడ్లను రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనం రూ.42 వేలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. స్కీం వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం తీసుకురావాలని కోరారు. ఈ డిమాండ్ల సాధన కోసం ఢిల్లీలోని పార్లమెంట్‌ను ముట్టడించే కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి కార్మికులంతా పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ ఉపాధ్యక్షులు గోపాల్‌, కోశాధికారి ఎన్టీఆర్‌ శ్రీనివాసులు, బంగారు నాగరాజు, మున్సిపల్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు ఎటీఎం నాగరాజు, నగర కార్యదర్శి తిరుమలేష్‌, లక్ష్మీనారాయణ, లక్ష్మీ నరసమ్మ, ఎర్రిస్వామి, రాఘవ, పెన్నా, ఓబుళపతి, రాయుడు, సుబ్బిరెడ్డి, మురళి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్