ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : దేశ రాజధాని ఢిల్లీని ముట్టడించి హక్కులు సాధించుకుందామని సిఐటియు నగర కార్యదర్శి మూర్తుజ పిలుపునిచ్చారు. సిఐటియు ఆల్ ఇండియా కమిటీ పిలుపుమేరకు వచ్చేనెల 1, 2, 3వతేదీల్లో నిర్వహించనున్న ‘ఢిల్లీని ఆక్రమిద్దాం, హక్కులు సాధించుకుంటాం’ అనే కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికలను సోమవారం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూ నాలుగు లేబర్ కోర్సులు తీసుకొచ్చిందన్నారు. లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, రూ.42 వేల కనీస వేతనం చెల్లించాలని, స్కీం వర్కర్లకు ఉద్యోగ భద్రత, అసంఘటిత రంగాల కార్మికులకు సమగ్ర చట్టం తేవాలన్నారు. ఆయా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టనున్న ఢిల్లీ పార్లమెంటు ముట్టడికి కార్మికులంతా కదం తొక్కి జయప్రదం చేయాలని పిలుపునిచారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఉపాధ్యక్షులు గోపాల్, కోశాధికారి ఎన్టీఆర్ శ్రీనివాసులు, బంగారు నాగరాజు, మున్సిపల్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎటిఎం నాగరాజు, నగర కార్యదర్శి తిరుమలేష్, లక్ష్మీనారాయణ, లక్ష్మీనరసమ్మ, ఎర్రిస్వామి, రాఘవ, పెన్నా ఓబుళపతి, రాయుడు, సుబ్బిరెడ్డి, మురళి, తదితరులు పాల్గొన్నారు.
ఢిల్లీని ముట్టడించి హక్కులు సాధించుకుందాం
16 నవంబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 16, 2026, 05:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)