ప్రజాశక్తి-నార్పల : మండలంలోని పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ స్వీకరించేందుకు ప్రత్యేక స్వర్ణ గ్రామాలను ఎంపిక చేసినట్లు ఎంపిడిఒ మమతాదేవి తెలిపారు. ఈమేరకు ఆదివారం ఆయా స్వర్ణగ్రామాల జాబితాను విడుదల చేశారు. మండల కేంద్రంలోని సర్పంచు, వార్డు మెంబర్ల అభ్యర్థులు స్థానిక వెలుగు కార్యాలయంలో నామినేషన్లను సమర్పించాలన్నారు. అలాగే పప్పూరు, బండ్లపల్లి, సిద్ధరాచెర్ల, హెచ్.శోధనపల్లి, బొందలవాడ పంచాయతీలో పప్పూరు, గూగూడు, గంగనపల్లి, రంగాపురం, గుంజేపల్లి పంచాయతీలు గూగూడులో, నడిమిదొడ్డి, నాయనపల్లి, గడ్డంనాగేపల్లి, వెంకటాంపల్లి పంచాయతీలు నడిమిదొడ్డి, కేసేపల్లి, దుగుమర్రి, చామలూరు పంచాయతీల సర్పంచులు, వార్డు మెంబర్లు కేసేపల్లి స్వర్ణగ్రామంలో నామినేషన్లను సమర్పించాలని కోరారు.
నామినేషన్లు స్వీకరించే కేంద్రాల జాబితా విడుదల
15 నవంబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 15, 2026, 05:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)