ప్రజాశక్తి - అనంతపురం: ప్రముఖ బెంగళూరు బేకరీ యజమాని శ్రీనివాసులు సోదరుడు స్వామి గుండెపోటుతో మృతి చెందారు. శనివారం ఉదయం పీటీసీ గ్రౌండ్‌లో షటిల్ ఆడుతుండగా ఆయనకు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. దీంతో అక్కడే ఉన్న పీటీసీ గ్రౌండ్ ఇన్‌చార్జి నారాయణస్వామి వెంటనే స్పందించి, అంబులెన్స్‌లో స్వామిని ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ స్వామి మృతి చెందారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది.
షటిల్ ఆడుతుండగా గుండెపోటు.. వ్యక్తి మృతి
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 28, 2026, 12:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)