ప్రజాశక్తి-రామచంద్రపురం: అనంతపురం జిల్లా లేపాక్షి జవహర్లాల్ విద్యాలయంలో జరిగిన రాష్ట్రస్థాయి 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-19 బాస్కెట్బాల్ పోటీల్లో రామచంద్రపురం మోడరన్ జూనియర్ కళాశాల విద్యార్థి కొడమంచిలి హర్షతేజ సత్తా చాటాడు. ఈ నెల 7 నుండి 9వ తేదీ వరకు నిర్వహించిన ఈ పోటీల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జట్టు తరపున హర్షతేజ ప్రాతినిధ్యం వహించాడు. ఉమ్మడి జిల్లా జట్టు రాష్ట్రస్థాయిలో నాలుగో స్థానంలో నిలవడంలో హర్షతేజ కీలక భూమిక పోషించాడని మోడరన్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ లయన్ జివి రావు తెలిపారు. సోమవారం కళాశాల ప్రాంగణంలో హర్షతేజను అధినేత జి.వి.రావు, ఇంటర్మీడియట్ ప్రిన్సిపల్ సిహెచ్ రాజేష్, పిఇటి మోహనకృష్ణ ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి గొప్ప క్రీడాకారుడిగా ఎదగాలని డాక్టర్ జి.వి రావు ఆకాంక్షించారు.
బాస్కెట్బాల్ పోటీల్లో సత్తాచాటిన 'మోడరన్' విద్యార్థి
16 నవంబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 16, 2026, 05:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)