ప్రజాశక్తి అనంతపురం కార్పొరేషన్ : వార్డు సచివాలయ ఉద్యోగులకు ఆరు సంవత్సరాల పూర్తయిన ప్రతి ఉద్యోగికి తక్షణమే ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ అమలు చేయాలని R D M A కి శుక్రవారం వినతి సమర్పించారు. AP.VWSGEA-AP.GWSEF రాష్ట్ర నాయకులు కలిసి వార్డు సచివాలయ ఉద్యోగులు ఆరు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన ప్రతి ఉద్యోగికి తక్షణమే ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీం A.A.S అమలు విషయంలో జాప్యాన్ని నివారించి తక్షణమే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. RDMA స్పందిస్తూ తన పరిధిలో ఉన్న 5 మున్సిపల్ కార్పొరేషన్లు మరియు 37 మున్సిపాలిటీలో కూడా ఈ అమలు విషయంపై తక్షణమే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమం లో AP.VWSGEA- APGWSEF నాయకులు డి సుధాకర్, వి.లక్ష్మి నారాయణ, ఎం.కె వరప్రసాద్, మల్లికార్జున, సి రాలచంద్ర, చిన్నూరప్ప,శివశంకర్, రామకృష్ణ,మహేష్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ అమలు చేయాలని R D M A కి వినతి
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 21, 2026, 04:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)