ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : నార్పల మండల ఎంపీపీ జనరల్ మహిళ, జడ్పిటిసి అన్ రిజర్వుడ్ జనరల్ రిజర్వేషన్లు ఖరారు కావడంతో మండల వ్యాప్తంగా పలు పార్టీలలో సమీకరణలు చర్చలు ప్రారంభమయ్యాయి జిల్లా నాయకులు అధిష్టానానికి తమ పేర్లు ప్రతిపాదించాలని పలువురు ఆశవాహులు పేర్లు ఇస్తున్నారని మరికొందరైతే పార్టీ ఏదైనా పర్లేదు తాము ఇంత డబ్బు ఖర్చు పెట్టగలము అంటూ మధ్యవర్తుల ద్వారా ఇరు ప్రధాన పార్టీల నాయకులను కలుస్తున్నట్లు మండల వ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి మండల వ్యాప్తంగా మొత్తం 16 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి బండ్లపల్లి ఎస్సీ మహిళ, శోధన పల్లి జనరల్ మహిళ బొందలవాడ జనరల్ కేసేపల్లి జనరల్ గడ్డం నాగేపల్లి ఎస్సి జనరల్ బి.పప్పూరు ఎస్సీ జనరల్ గంగనపల్లి జనరల్ మహిళ దుగుమర్రి బీసీ జనరల్ వెంకటంపల్లి బీసీ మహిళ గూగుడు జనరల్ చామలూరు జనరల్ మహిళ నార్పల1 బిసి జనరల్ నార్పల2 బీసీ మహిళ నార్పల 3 జనరల్ మహిళ నార్పల 4 జనరల్ మహిళ, నార్పల 5 బీసీ జనరల్ గా రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి ప్రస్తుత జడ్పిటిసి, ఎంపీపీ ఎన్నిక ప్రధాన పార్టీలకు పటిష్టాత్మకంగా మారింది అందులోనూ రెండు ఓసీలకే రావడంతో ప్రధాన పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎలాగైనా విజయం సాధించాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం ఎక్కడెక్కడ ఏ పార్టీ బలంగా ఉంది బలమైన నాయకులు ఎవరున్నారు అని చర్చలు మొదలయ్యాయి పలువురు ఆశావాహులు నాయకుల చుట్టూ తిరుగుతూ ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు అదేవిధంగా నాయకులు కూడా వారి వారి పరిధిలో బలాబలాలను బేరీజు వేసుకొని అధిష్టానానికి పేర్లు పంపడానికి సిద్ధం చేస్తున్నారు మొత్తానికి రెండు ప్రధాన పార్టీలలో వర్గ పోరు ఉండడంతో ఇప్పటికే మధ్యవర్తుల ద్వారా రాజీ ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రధాన పార్టీలు ఎవరెవరి అభ్యర్థిత్వ రిజర్వేషన్లు ఖరారు కావడంతో మండలంలో సమీకరణలు చర్చలు మొదలయ్యాయి.
రిజర్వేషన్లు ఖరారు - మండలంలో సమీకరణల చర్చలు....
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 14, 2026, 11:48 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)