మంగళవారం, 08 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అనంతపురం యువ షూటర్ల సత్తా

1 గంట క్రితం

The potential of young shooters from Anantapur
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 08, 2026, 02:35 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

సౌత్‌జోన్‌ ఛాంపియన్‌షిప్‌లో ప్రతిభ.. నేషనల్స్‌కు ఐదుగురి అర్హత


ప్రజాశక్తి - అనంతపురం : కేరళ రాజధాని తిరువనంతపురంలోని ప్రతిష్టాత్మక వట్టియాయ్కావుర్‌ నేషనల్‌ షూటింగ్‌ రేంజ్‌లో జరిగిన 17వ సౌత్‌జోన్‌ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో అనంతపురం నగరానికి చెందిన యువ షూటర్లు సత్తా చాటారు. వివిధ విభాగాల్లో అత్యుత్తమ స్కోర్లు సాధించి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారు. దీంతో అనంతపురం షూటింగ్‌ క్రీడాకారుల ప్రతిభ మరోసారి జాతీయ స్థాయిలో వెలుగులోకి వచ్చింది. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన ఐదుగురు క్రీడాకారులు ఢిల్లీలోని ప్రతిష్టాత్మక డాక్టర్‌ కర్నీ సింగ్‌ షూటింగ్‌ రేంజ్‌లో జరగనున్న జాతీయ స్థాయి షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలకు అధికారికంగా అర్హత సాధించినట్లు అకాడమీ కోచ్‌ శ్రీకాంత్‌ తెలిపారు.


011


నేషనల్స్‌కు అర్హత సాధించిన వారు ....

10 మీటర్ల ఉమెన్స్‌ పిస్టల్‌ : నికిత, సీజన్‌ సుహా

10 మీటర్ల పిస్టల్‌ : కార్తికేయ, గోళ్ల మహీధర్‌, తీక్షన్‌ సాయి


కఠినమైన సాధన, క్రమశిక్షణ, పట్టుదలతో శిక్షణ పొందుతూ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఈ యువ షూటర్లను క్రీడా వర్గాలు అభినందిస్తున్నాయి. దక్షిణ భారత స్థాయి పోటీల్లో సత్తా చాటి జాతీయ స్థాయి బరిలోకి అడుగుపెట్టడం అభినందనీయమని పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా కోచ్‌ శ్రీకాంత్‌ మాట్లాడుతూ జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించిన క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించారు. ఢిల్లీలో జరగనున్న నేషనల్స్‌లోనూ ఇదే స్ఫూర్తితో రాణించి పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. అనంతపురం నగరానికి, అకాడమీకి మంచి పేరు తీసుకురావాలని కోరారు. యువ షూటర్ల విజయంపై నగర ప్రజలు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
022


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్