ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి పటిష్ట భద్రత

2 రోజుల క్రితం

Tight security for the swearing in of the ZP Chairman and Vice Chairman
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 12:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-కొత్తచెరువు రూరల్ (అనంతపురం) : శ్రీ సత్యసాయి జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నేపథ్యంలో శుక్రవారం పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. డీఎస్పీ మాణిక్యరావు ఆధ్వర్యంలో కార్యక్రమ ప్రాంగణం చుట్టూ భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా రహదారిపై ముళ్లకంచెలు, పోలీస్ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రాంగణం ప్రధాన ద్వారం వద్ద పోలీసు సిబ్బందిని మోహరించి, పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రశాంతంగా జరిగేలా పోలీసు శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్