సమయపాలన లేని అధికారులు, సిబ్బంది
దోచుకున్నోనికి దోచుకున్నంత
ప్రజాశక్తి-ఆత్మకూరు : ఆత్మకూరు మండల కేంద్రంలో పశు వైద్యశాల విధులకు పశువైద్యాధికారి గత 15 రోజులుగా రావటం లేదని కొంతమంది పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆత్మకూరు మండలం కేంద్రంలో వైద్యశాల ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతీ ప్రభుత్వ పశువైద్య పథకం పాడి రైతులకు పూర్తి స్థాయిలో అందడంలేదని, పాడి పశువులకు,గొర్రెలకు, ఇతర మూగ జీవాలకు చిన్నపాటి వ్యాధి వస్తే ప్రయివేట్ పశు వైద్యులనే ఆశ్రయించాల్సిన వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆత్మకూరు పశు వైద్య శాలలో వైద్యులు 11 దాటిన ఖాళీ కుర్చీలతో దర్శనమిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పశువులకు వ్యాధి వస్తే డాక్టర్ కానీ కాంపౌండర్ కానీ స్పందించకపోవడం మరింత దారుణం అనీ, ఇప్పటికైనా జిల్లా ఉన్నతి అధికారులు స్పందించి ఆత్మకూరు పశువైద్యశాల, సచివాలయపశు వైద్య సిబ్బందిపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మండలంలోని పాడి రైతులు, ప్రజలు కోరుతున్నారు.







కామెంట్‌లు (0)