శుక్రవారం, 09 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆటోను లాగుతూ కోట జంక్షన్ వద్ద డ్రైవర్ల నిరసన

57 నిమిషాల క్రితం

vzm-2
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 09, 2026, 03:34 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ఉబర్, ఓలా రాపిడో అనుమతులు రద్దు చేయాలని డిమాండ్.

అక్టోబర్ 13 న కలెక్టరేట్ వద్ద ధర్నాకు పిలుపు.

ప్రజాశక్తి..విజయనగరం టౌన్ : ఉబర్ , ఓలా, రాపిడో , శ్రీ శక్తి పథకంతో ఆటో, క్యాబ్ డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారని సి ఐ టి యు జిల్లా కోశాధికారి ఏ.జగన్ మోహన్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా స్థానిక కోట జంక్షన్ వద్ద ఆటో ను తాడుతో లాగి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీ ఐ టి యు నగర కార్యదర్శి బి. రమణ , ఉపాధ్యక్షులు రెడ్డి శంకర్ రావు లతో కలిసి ఆయన మాట్లాడుతూ .. ఆటో, క్యాబ్ రవాణా రంగం వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వేల కోట్లు లాభాలు వస్తున్నాయని , డ్రైవర్లను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు అన్ని రకాల ఫీజులు, ఫెనాల్టీలు , ఈ చలానాలు పెంచి నడ్డి విరుస్తున్నారని ధ్వజమెత్తారు. ఒకే దేశం ఒకే పన్ను అంటున్న మోదీ పెట్రోల్, డీజిల్ ను ఎందుకు జి ఎస్ టి పరిధిలోకి తేలేదని ప్రశ్నించారు. కేరళ, తమిళనాడు, బెంగాల్ వంటి కొన్ని రాష్ట్రాల్లో సంక్షేమ బోర్డ్ ఏర్పాటు చేశారని, ఏపీ లో కూటమి ప్రభుత్వం, కేంద్రం లో మోదీ ఎందుకు ఏర్పాటు చేయటం లేదని, ఒక్క పైసా ప్రభుత్వం ఇవ్వకుండానే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయవచ్చని నివేదికను ప్రభుత్వాలకు ఇచ్చిన స్పందించడం లేదన్నారు. వీరికి స్వయం ఉపాధిగా బ్రతుకుతున్న డ్రైవర్లు కంటే కార్పొరేట్ ప్రయోజనాలే ముఖ్యమని అందుకే ఉబర్, ఓలా రాపిడో సంస్థలకు పార్కింగ్ స్థలాలతో పాటు అనుమతులు ఇచ్చారని, రాత్రి ,పగలు ప్రజా, సరుకు రవాణా లో కీలకమైన డ్రైవర్లను ప్రమాదాలకు బాధ్యులను చేస్తూ బి ఎన్ ఎస్ క్రిమినల్ చట్టం 106 (1&2) చేశారన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం శ్రీ శక్తి పథకం తో ఆటో,క్యాబ్ లకు ఉన్న బేరాలు తగ్గిపోయాయని, అధికారం లోకి రాగానే జి ఓ నెంబర్ 21 రద్దు చేస్తాం, సంక్షేమ బోర్డ్ ఏర్పాటు చేస్తామన్న హామీ ప్రకటనలెకే పరిమితం అయింది. ఆటో, క్యాబ్ లకు సాయం క్రింద 2025 లో కొద్దిమందికే 150000- లు వేసారు. 2026 ఇంకా ఎలాంటి ప్రకటన లేదు. లైసెన్స్ ఉన్న ప్రతి ఆటో ,క్యాబ్ డ్రైవర్లకు సాయం క్రింద తక్షణమే 20,000/- లు ఇవ్వాలి. రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వమే ప్రత్యేక యాప్ నిర్వహణ, జి ఓ నెంబర్ 21 రద్దు, ఉబర్,ఓలా,రాపిడో సంస్థల అనుమతులు, ఏ టి ఎస్ సెంటర్లు రద్దు, ఎల్లో బోర్డ్ వాహనాలకు రాయితీ పై పెట్రోల్ డీజిల్ ఇవ్వాలి, వైట్ బోర్డ్ వాహన దారులు యాప్ ద్వారా ప్రయాణికుల సర్వీస్ లను నియంత్రించాలి.క్యాబ్ లకు టోల్ ఛార్జీలు మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకోసం అక్టోబర్ 13 న మంగళవారం కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాలో డ్రైవర్లంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆటో క్యాబ్ యూనియన్ నాయకులు బి పాపారావు, బి. రామునాయుడు, గంగ రాజు, లక్ష్మణ రావు, కుర్మారావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్