ప్రజాశక్తి-తాడిపత్రి రూరల్
మండలంలోని ఈ.గూడూరు-తిమ్మేపల్లి గ్రామాల మధ్య నిర్మించిన వంతెనను బుధవారం ఎమ్మెల్యే జెసి అస్మిత్‌రెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే తమ లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా ఈ.గుడూరు-తిమ్మేపల్లి గ్రామాల మధ్య బ్రాహ్మణపల్లి వద్ద రూ. 1.6 కోట్లతో నూతనంగా వంతెన నిర్మించి ప్రారంభించామన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులను అభివృద్ధి చేస్తూ, నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. వంతెనను అందుబాటులోకి రావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)