ప్రజాశక్తి-నార్పల
మండలంలో జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎంపీపీ-జనరల్ మహిళ, జడ్పీటీసీ-అన్ రిజర్వుడ్ చేశారు. మండలంలో మొత్తం-16 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. బండ్లపల్లి-ఎస్సీ మహిళ, శోధనపల్లి-జనరల్ మహిళ, బొందలవాడ-జనరల్, కేసేపల్లి-జనరల్, గడ్డం నాగేపల్లి-ఎస్సీ జనరల్, బి.పప్పూరు-ఎస్సీ జనరల్, గంగనపల్లి-జనరల్ మహిళ, దుగుమర్రి-బీసీ జనరల్, వెంకటంపల్లి-బీసీ మహిళ, గూగూడు-జనరల్, చామలూరు-జనరల్ మహిళ, నార్పల-1-బీసీ జనరల్, నార్పల-2-బీసీ మహిళ, నార్పల-3- జనరల్ మహిళ, నార్పల-4-జనరల్ మహిళ, నార్పల-5-బీసీ జనరర్కు కేటాయించారు. జడ్పీటీసీ, ఎంపీపీ ఎన్నికలు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. దీంతో మండల వ్యాప్తంగా రాజకీయ సమీకరణలు, చర్చలు ఊపందుకున్నాయి. పలువురు ఆశావహులు జిల్లా అధిష్టానానికి పేర్లు ఇస్తుండగా, మరికొందరు పార్టీ ఏదైనా పర్లేదు తాము డబ్బు ఖర్చు పెట్టగలం అంటూ మధ్యవర్తుల ద్వారా ప్రధాన పార్టీల ముఖ్య నాయకులను కలుస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎక్కడెక్కడ ఏ పార్టీ బలంగా ఉంది. బలమైన నాయకులు ఎవరున్నారు అనే చర్చలు మొదలయ్యాయి. పలువురు ఆశావహులు నాయకుల చుట్టూ తిరుగుతూ ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. నాయకులు కూడా వారి వారి పరిధిలో బలాబలాలను బేరీజు వేసుకొని అధిష్టానానికి పేర్లు పంపడానికి సిద్ధమవుతున్నారు. మొత్తానికి రెండు ప్రధాన పార్టీల్లో వర్గ పోరు ఉండడంతో ఇప్పటికే మధ్యవర్తుల ద్వారా రాజీ ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ప్రధాన పార్టీలు ఎవరెవరి అభ్యర్థిత్వలు ఖరారు చేస్తాయో.. విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.







కామెంట్లు (0)