యాడికి : జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా సోమవారం గ్రంథాలయోద్యమ పితామహులకు నివాళులర్పించారు. ఇందులో భాగంగా మండల కేంద్రంలోని గ్రంథాలయంలో గ్రంథాలయ పితాహులు శ్రీ అయ్యంకి వెంకటరమణయ్య,గాడిచర్ల హరిసర్వోత్తమరావు, పాతూరి నాగభూషణం చిత్రపటాలకు పూలమాలలు వేసి అంజళి ఘటించారు. ఈ సందర్భంగా లైబ్రేరియన్ మధుసూదన్ మాట్లాడుతూ మహనీయుల జీవిత చరిత్రను గ్రంథాలయోద్యమానికి విశేష సేవలందించిన మహనీయుల నిస్వార్థ సేవాభావం, అంకితభావాన్ని స్మరించుకోవడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది వినయ్‌కుమార్, పాఠకులు సాయి, విజయ్, రమణ, నాయుడు, విరూపాక్షి, తదితరులు పాల్గొన్నారు.
గ్రంథాలయ ఉద్యమ స్మరణ సమావేశం
6 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 16, 2026, 06:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)