ప్రజాశక్తి నార్పల
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎరువుల పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు నేటి నుండి ఎఫ్ ఎఫ్ ఎస్ (ఫ్రేంవర్క్ ఫర్ ఫెర్టిలిజర్ సేల్) విధానాన్ని మంగళవారం నుండి అమలు చేయడం జరుగుతుంది.అని మండల వ్యవసాయ అధికారి చెన్న వీరాస్వామి తెలిపారు ఈ విధానంలో రైతులు ఎఫ్ ఎఫ్ మొబైల్ యాప్ ద్వారా తమ రైతు ఐడి, భూమి వివరాలు, సాగు చేస్తున్న పంట వివరాలను నమోదు చేసి, తమకు అవసరమైన ఎరువులను బుక్ చేసుకోవాలి.
బుకింగ్ పూర్తయిన అనంతరం జనరేట్ అయ్యే క్యూఆర్ కోడ్ నెంబర్ ఆధారంగా ఎంపిక చేసుకున్న ఎరువుల డీలర్ వద్ద ఎరువులను పొందవచ్చు.
ఈ సందర్భంగా గ్రామ వ్యవసాయ సహాయకులు తమ గ్రామ పరిధిలోని రైతులందరికీ ఈ యాప్ వినియోగంపై అవగాహన కల్పించాలని, రైతుల రైతు ఐడి, ఆధార్ లింక్ మొబైల్ నంబర్, భూమి వివరాలు, సర్వే నంబర్లు మరియు పంట వివరాలను పరిశీలించి, యాప్లో నమోదు చేసుకోవడానికి అవసరమైన సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది.అదేవిధంగా రైతులు ఈ యాప్ ద్వారా ఎరువుల బుకింగ్ చేసుకునే విధానం, క్యూఆర్ కోడ్ పొందడం, డీలర్ వద్ద ఈ పి ఓ మెషీన్ ద్వారా ఎరువులు కొనుగోలు చేసే విధానం గురించి వివరించడం జరుగుతుంది.గ్రామ వ్యవసాయ సహాయకులు గ్రామ పరిధిలోని ఎరువుల డీలర్లతో సమన్వయం చేసుకుంటూ ఎరువుల స్టాక్ లభ్యతను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని, రైతులకు ఎరువులు నిర్ణీత గరిష్ఠ చిల్లర ధర ప్రకారం అందేలా చేయడం జరుగుతుంది అని.
ప్రతి ఎరువుల విక్రయానికి డీలర్లు తప్పనిసరిగా e-POS ద్వారా బిల్లును జారీ చేయాలి అని ఆదేశాలు ఇవ్వడం జరిగినది.రైతులు తమ ఆధార్ లింక్ మొబైల్ నంబర్, రైతు ఐడి వివరాలు సిద్ధంగా ఉంచుకోవాలని, వాస్తవంగా సాగు చేస్తున్న పంట మరియు భూమి వివరాలను మాత్రమే నమోదు చేయాలని చెప్పడం జరిగినది.ఈ విధానం అమలులో రైతులకు ఎదురయ్యే సాంకేతిక సమస్యలు, ఎరువుల లభ్యతకు సంబంధించిన ఇబ్బందులను గ్రామ వ్యవసాయ సహాయకులు వెంటనే మండల వ్యవసాయ అధికారి దృష్టికి తీసుకురావాలి.ఎరువుల పంపిణీలో పారదర్శకతను పెంపొందించి, అర్హులైన రైతులకు అవసరమైన ఎరువులు సకాలంలో అందించడమే ఎఫ్ ఎఫ్ ఎస్ విధానం ప్రధాన ఉద్దేశం అన్నారు







కామెంట్లు (0)