ప్రజాశక్తి-అనంతపురం
కాకినాడలో జరిగిన 38వ రాష్ట్రస్థాయి రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్–2026లో కేతిరెడ్డి నిహాంత్ రెడ్డి అద్భుత ప్రతిభ కనబరిచాడు. అతిచిన్న వయస్సులోనే 4–6 సంవత్సరాల విభాగంలో లింక్-1 కేటగిరీలో పోటీపడి ఏకంగా రెండు స్వర్ణ పతకాలు సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. కోచ్ అంజి అందించిన ప్రత్యేక శిక్షణ, తల్లిదండ్రులు కేతిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జ్యోతిర్మయి అందించిన ప్రోత్సాహం, నిహాంత్ నిరంతర సాధన ఈ విజయానికి బాటలు వేశాయి. చిన్న వయస్సులోనే అసాధారణ ప్రతిభతో రెండు బంగారు పతకాలు సాధించిన నిహాంత్‌పై కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, క్రీడాభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నిహాంత్ విజయ ప్రస్థానం ఇలాగే కొనసాగి భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని పతకాలు సాధించి ఆంధ్రప్రదేశ్‌కు, దేశానికి గర్వకారణంగా నిలవాలని పలువురు కోరుతున్నారు.







కామెంట్‌లు (0)